Newsసర్వేల్లో ఎన్టీఆర్ టాప్.. ఈ ఇయర్ కూడా యంగ్ టైగర్ దే..!

సర్వేల్లో ఎన్టీఆర్ టాప్.. ఈ ఇయర్ కూడా యంగ్ టైగర్ దే..!

టెంపర్ తర్వాత సినిమాల ఫలితాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న యంగ్ టైగర్ లాస్ట్ ఇయర్ జై లవ కుశలో ట్రిపుల్ రోల్ తో ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. నట విశ్వరూపానికి తెలుగు ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. ఇక తన తర్వాత సినిమా త్రివిక్రం డైరక్షన్ లో చేస్తున్న తారక్ మార్చి నుండి సినిమా రెగ్యులర్ షూట్ మొదలు పెట్టనున్నాడు.

ఈ ఇయర్ క్రేజీ మూవీస్ లో మహేష్ కొరటాల శివ భరత్ అనే నేను, అల్లు అర్జున్ వక్కంతం వంశీ నా పేరు సూర్య, సుజిత్ ప్రభాస్ సాహో మూవీలతో పాటుగా ఎన్.టి.ఆర్ త్రివిక్రం మూవీ కూడా వస్తుంది. అయితే ఆడియెన్స్ సర్వేల్లో త్రివిక్రం, తారక్ సినిమా మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని తెలుస్తుంది. దాదాపు 70 % ఆడియెన్స్ ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఈగర్ గా ఎదురుచూస్తున్నారట.

ఇయర్ ఇయర్ కు సంచలనంగా మారుతున్న తారక్ 2018లో కూడా అన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. సర్వేల్లో టాప్ గా ఉన్న తారక్ సినిమా అన్నివిధాలుగా టాప్ రేంజ్ లో నిలబెడతాడని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news