Gossipsఛలో భామకు ఎన్టీఆర్ ఫిదా..! రష్మిక తో రొమాన్స్ కి రెడీ.....

ఛలో భామకు ఎన్టీఆర్ ఫిదా..! రష్మిక తో రొమాన్స్ కి రెడీ.. !!

కిర్రిక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన కన్నడ భామ రష్మిక మందన రీసెంట్ గా ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. తెలుగులో మొదటి సినిమా అది కూడా నాగ శౌర్య లాంటి యువ హీరో పక్కన అమ్మడు అదరగొట్టింది. ఈ సినిమా రిజల్ట్ తో స్టార్ హీరోల కళ్లల్లో పడ్డది రష్మిక. ఛలోలో అమ్మడి అభినయానికి అందరు ఫిదా అయ్యారు.

ఛలో సూపర్ హిట్ అమ్మడికి ఓ క్రేజీ ఛాన్స్ తెచ్చి పెట్టిందని అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ గా రష్మిక సెలెక్ట్ అయ్యిందని టాక్. ముందు అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా అనుకోగా అజ్ఞాతవాసి ఫ్లాప్ తో ఆమెను పక్కన పెట్టారట. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు అవకాశం ఉండగా ఒకరు పూజా హెగ్దె కాగా మరో హీరోయిన్ గా రష్మిక ఛాన్స్ పట్టేసిందట.

కన్నడలో ఆల్రెడీ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు చూస్తుంటే తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకునేలా ఉంది. ఛలోలో ఆమె పర్ఫార్మెన్స్ చూసిన ఎవరైనా ఈ మాట అనక తప్పదు. మరి ఎన్.టి.ఆర్ సినిమాలో రష్మిక కన్ఫామా కాదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news