Gossipsసరికొత్త రికార్డ్ సృష్టించనున్న తారక్ ! స్టార్ హీరోలెవరు అందుకోలేరు

సరికొత్త రికార్డ్ సృష్టించనున్న తారక్ ! స్టార్ హీరోలెవరు అందుకోలేరు

టెంపర్ సినిమా తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత సినిమా త్రివిక్రమ్ దర్శకత్వం లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం ఒక పక్క ఎన్టీఆర్ తన లుక్ కోసం విపరీతమైన వర్క్ అవుట్ చేస్తుండగా మరొక వైపు సినిమా యూనిట్ పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. దీనికోసం అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గరలో ఒక పెద్ద సెట్ కూడా వేస్తున్నారంట.

ఇక ఈ సినిమాని సింగిల్ షెడ్యూల్లో పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు.ఓక స్టార్ హీరో చిత్రం చేయాలంటే చాలా షెడ్యూల్స్ అవసరం అవుతాయి. కానీ ఈ సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు టీం మొత్తం ఎంతో పకడ్బందీగా పనులు చక్కబెట్టేస్తున్నారంట.సింగల్ షెడ్యూల్ లోనే కనుక ఈ సినిమా పూర్తి చేయగలిగితే స్టార్ హీరోలెవరు ఎన్టీఆర్ ని అందుకోలేరేమో..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news