ఎన్టీఆర్ గ్రేట్, ఎన్టీఆర్ గ్రేటెస్ట్, ఎన్టీఆర్ బెస్ట్…కెరీర్ ప్లానింగ్ కేక!!

young tiger ntr great

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత కూడా నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని వెంటనే పట్టాలెక్కించలేకపోయాడు ఎన్టీఆర్. ఉన్న కొద్ది మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఎవరి ప్రాజెక్ట్స్‌లో వాళ్ళు బిజీగా ఉండడంతో ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఎప్పుడూ లేనట్టుగా కొన్ని నెలలు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. కానీ ఆ అనుభవం మాత్రం ఎన్టీఆర్‌కి బాగానే ఉపయోగపడింది. మరోసారి అలాంటి ఖాళీ ఎప్పుడూ రాకుండా ఉండేేలా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఆల్రెడీ ఇప్పుడు బాబీతో ఓ సినిమాను చేస్తున్న ఎన్టీఆర్….ఆ వెంటనే త్రివిక్రమ్‌తో కూడా ఓ సినిమాను సెట్ చేసి పడేశాడు. త్రివిక్రమ్‌తో సిినిమాకు సంబంధించి అగ్రిమెంట్స్, అడ్వాన్సులు వ్యవహారం కూడా కంప్లీట్ అయిపోయింది.

ఇప్పుడిక త్రివిక్రమ్ తర్వాత సినిమాను కూడా సెట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇష్క్, మనం, 24 సినిమాలతో సౌత్‌లోనే వన్ ఆఫ్ ద టాలెంటెడ్ డైరెక్టర్స్‌గా పేరు తెచ్చుకున్న విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో నటించడానికి రెడీ అయ్యాడు ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో సినిమాతో తనలోని క్లాస్‌ని చూపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఎన్టీఆర్…..ఇక విక్రమ్ కుమార్‌తో చేయబోయే సినిమాతో హాలీవుడ్ రేంజ్‌లో కనిపిస్తాడని ఎన్టీఆర్ ఫ్రెండ్స్ చెప్తున్నారు. విక్రమ్ కుమార్ సినిమా అయిన వెంటనే కూడా మరోసారి సుకుమార్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాల ఆర్డర్ చూస్తుంటే మాత్రం….టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలలాగే ఎన్టీఆర్ గ్రేట్ సినిమా, ఎన్టీఆర్ గ్రేటెస్ట్ సినిమా..ఎన్టీఆర్ ద బెస్ట్ సినిమా అనే రేంజ్ సినిమాలు వరుసగా థియేటర్స్‌ని షేక్ చేయడం ఖాయమనిపిస్తోంది. సౌత్ ఇండియా రేంజ్‌లో మార్కెట్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్న ఎన్టీఆర్ ఆశయం కూడా నెరవేరేలానే కనిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ సినిమా కమిట్మెంట్స్‌తో నందమూరి అభిమానులు గర్వం, ఆనందం ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాలా?

More from my site