Videosటీజర్ తోనే సంచలనం సృష్టించిన ఎన్టీఆర్.. కాస్కోండి రికార్డుల లెక్క ఇప్పటి...

టీజర్ తోనే సంచలనం సృష్టించిన ఎన్టీఆర్.. కాస్కోండి రికార్డుల లెక్క ఇప్పటి నుండే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబి డైరక్షన్ లో వస్తున్న సినిమా జై లవకుశ. ఈ సినిమా టీజర్ ఎలా ఉంటుంది అనే అంచనాలను మించుతూ కొద్ది నిమిషాల క్రితం టీజర్ రిలీజ్ అయ్యింది. జై గా ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. టీజర్ తోనే సినిమా సంచలనం సృష్టించబోతుందని దండోరా వేశాడు తారక్.

ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాలో తారక్ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్నారు. ఎన్.టి.ఆర్ కెరియర్ లో ఇప్పటిదాకా చూడని కొత్త అద్భుతాలను జై లవకుశలో చూడబోతున్నామని తెలుస్తుంది. ఇక ఫ్యాన్స్ కూడా టీజర్ రిలీజ్ ను రికార్డ్ వ్యూస్ వచ్చేలా సంసిద్ధమై ఉన్నారు. ఇప్పటిదాకా మిగతా స్టార్ హీరోల రికార్డులెలా ఉన్నా తారక్ జై లవకుశ అదరగొట్టేలా రికార్డుల మోత మోగాలని వారు ప్రయత్నిస్తున్నారు.

రికార్డుల లెక్క ఇప్పటి నుండే సరిచేసేలా ఎన్.టి.ఆర్ ఖలేజా చెప్పబోతున్న ఈ టీజర్ కచ్చితంగా అనుకున్న అంచనాలను అందుకుందని చెప్పడంలో సందేహం లేదు. గంటలోనే మిలియన్ మార్క్ కాదు 2 మిలియన్స్ తో టోటల్ ఇండస్ట్రీనే షేక్ చేసే సినిమాగా జై లవకుశ కొత్త సమీకరణాలను ఏర్పరస్తుంది. మొదటి టీజర్ తోనే బీభత్సం సృష్టించిన తారక్ మిగతా రెండు టీజర్ లతో ఇంకెంత రచ్చ చేస్తాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news