Gossipsబిగ్ బాస్-2 నుండి ఎన్.టి.ఆర్ అవుట్.. కారణాలు ఇవేనా..!

బిగ్ బాస్-2 నుండి ఎన్.టి.ఆర్ అవుట్.. కారణాలు ఇవేనా..!

బాలీవుడ్ లో బుల్లితెర మీద సంచలనాలు సృష్టించిన రియాలిటీ షో బిగ్ బాస్. ఆ షోని లాస్ట్ ఇయర్ తెలుగులోకి తీసుకొచ్చింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా బుల్లితెర టి.ఆర్.పి రేట్లతో చెడుగుడు ఆడేలా చేసింది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో. వారం మొత్తం ఎలా ఉన్నా శని ఆదివారాల్లో వచ్చే తారక్ షో మొత్తం ఓన్ చేసుకునే వాడు. ఇది అది అని కాదు ఏదైనా చేసేస్తా అంటూ తారక్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు అందరికి తన సత్తా చూపించాడు.

ఇక బిగ్ బాస్ 1 ముగిసింది.. సీజన్-2 స్టార్ట్ అవబోతుంది. ఈ సీజన్ లో బిగ్ బాస్ కు హోస్ట్ గా ఎన్.టి.ఆరే ఉంటారని అన్నారు. అయితే చూస్తుంటే పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. బిగ్ బాస్-2 కు తారక్ చేయాలనే ఆలోచనలో ఉన్నా కమిట్ అయిన సినిమాల వల్ల కుదిరట్లేదట. ప్రస్తుతం త్రివిక్రం తో సినిమా మరో నెలలో స్టార్ట్ చేయబోతున్న ఎన్.టి.ఆర్ ఆ తర్వాత రాజమౌళి సినిమాకు పనిచేయాల్సి ఉంది.

ముఖ్యంగా జక్కన్న సినిమాకు వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్నారట. దానికి కచ్చితంగా అటెండ్ అవ్వాలని అంటున్నారు. అందుకే జూన్ లో మొదలయ్యే బిగ్ బాస్ సీజన్-2 కి తన షెడ్యూల్ ఏమాత్రం సెట్ చేయలేకపోతున్నాడట తారక్. ఇక ఎన్.టి.ఆర్ కాకుంటే బిగ్ బాస్ సీజన్-2 ఎవరు హోస్ట్ గా చేస్తారు అంటే మొన్నామధ్య నాని పేరు వినిపించింది. అయితే నాచురల్ స్టార్ గా ఉన్న నాని ఇయర్ కు 3 సినిమాలు తీయాలంటే బిగ్ బాస్ కోసం కేటాయించడం కష్టం. మరి సీజన్-2 హ్యాండిల్ చేసే స్టార్ ఎవరో తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news