Gossipsబ్రేకింగ్ న్యూస్ : ముఖ్యమంత్రి కి సపోర్ట్ చేయడానికొస్తున్న యంగ్ టైగర్...

బ్రేకింగ్ న్యూస్ : ముఖ్యమంత్రి కి సపోర్ట్ చేయడానికొస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ !!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చాలా వేడిగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో మాస్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ చంద్రబాబు ని కానీ సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది ? ఆలోచన అయితే ఇంటరెస్టింగ్ గానే ఉంది. కానీ నిజ జీవితంలో అది జరుగుతుందా లేదా అనేది ఇప్పటికైతే చెప్పలేము కానీ సినిమా విషయంలో మాత్రం అది జరగబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భరత్ అనే నేను సినిమా లో మహేష్ బాబు ముఖ్యమంత్రి గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ముఖ్యమంత్రి ని సపోర్ట్ చేసేందుకు యంగ్ టైగర్ “భరత్ అనే నేను” సినిమా ఆడియో వేడుకకి ముఖ్య అతిధిగా వస్తున్నట్లు సమాచారం.

సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ ఇద్దరు ఒకే వేదిక మీద కనిపిస్తే.. అబ్బో ఇక అది చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగా ఎగబడతారో తెలిసిందే. ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి ఒకే వేదిక మీద కనిపించడం అరుదైన సంఘట అది కూడా ఫ్యాన్స్ సమక్షంలో అంటే ఇక అదో అద్భుత దృశ్యమని చెప్పొచ్చు.

మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఆడియో ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ కు చీఫ్ గెస్ట్ గా ఎన్.టి.ఆర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎన్.టి.ఆర్, మహేష్ మధ్య కూడా మంచి రిలేషనే ఉంది. ఎన్.టి.ఆర్ బాద్షాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మహేష్, ఎన్.టి.ఆర్ కలిసి ఒకే వేదిక మీద అంటే అది నిజంగా ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు.

మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది చూడాలి. ఏప్రిల్ 20న రిలీజ్ అవనున్న భరత్ అనే నేను సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. మహేష్ సరసన కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news