Gossipsఅరవింద సమేత.. డబుల్ ధమాకా తో దుమ్ము లేపనున్న ఎన్టీఆర్..!

అరవింద సమేత.. డబుల్ ధమాకా తో దుమ్ము లేపనున్న ఎన్టీఆర్..!

త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ చేస్తున్న సినిమాకు టైటిల్ గా అరవింద సమేత అని పెట్టారు. టైటిల్ రివీల్ చేస్తూ తారక్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అంచనాలకు తగినట్టుగానే టైటిల్, ఫస్ట్ లుక్ ఉండగా ఈ టైటిల్ చూసిన కొందరు ఈ సినిమాలో తారక్ డ్యుయల్ రోల్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు.

అరవింద సమేత.. త్రివిక్రం అత్తారింటికి దారేది స్టైల్ లో ఉంది. ఇక సమేతంగా అంటూనే వీర రాఘవలను రెండుగా విడగొట్టారు. అంటే ఎన్.టి.ఆర్ రెండు పాత్రల పేర్లు వీర, రాఘవ అయ్యుంటుందని అంటున్నారు. లేదా ఒకే పాత్ర అయినా రెండు వేరియేషన్స్ లో అయినా ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సినిమాలో కేవలం పూజా హెగ్దె మాత్రమే కాదు ఈషాని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారట. సో ఇన్ని ఈక్వేషన్స్ కలిశాయి కాబట్టి అరవింద సమేత సినిమాలో ఎన్.టి.ఆర్ ఒకరు కాదు ఇద్దరు అని అంటున్నారు. మరి అసలు సీక్రెట్ ఏంటన్నది సినిమా గురించి మరింత సమాచారం బయటకు వస్తేనే కాని తెలియదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news