నాగబాబు కామెంట్లపై యండమూరి స్పందన ఇదే!

yandamuri veerendranath response on nagababu comments

Yandamuri Veerendranath also response to Nagababu comments in Khaidi No 150 pre release event.

మెగా ఈవెంట్ అయిన ‘ఖైదీ’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ని టార్గెట్ చేస్తూ నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ‘ఈమధ్యన ఒక ప్రముఖుడు.. రచనా వ్యాసంగంలో నిపుణుడు ఎవరినో హైలైట్ చేయడం కోసం రామ్ చరణ్‌ని తక్కువ చేస్తూ ఏవో చెత్త కామెంట్స్ చేశాడు. నిజానికి అతనంటే నాకు గౌరవం.. కాళ్లకు దండం కూడా పెడతాను.. కానీ వాడొక మూర్ఖుడు. మంచి రచయితే కానీ.. కామన్ సెన్స్ ఏమీ లేదు. వాడు వ్యక్తిత్వ వికాసం గురించి అందరికీ క్లాసులు చెబుతుంటాడు. అంతకంటే ముందు వాడు కాస్త వ్యక్తిత్వం నేర్చుకుంటే బెటర్’ అంటూ నాగబాబు కామెంట్ చేశారు. వీటిపై యండమూరి తాజాగా స్పందించారు.

తాను ఎప్పుడో చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నాగబాబు ఎంచుకున్న వేదిక సరైంది కాదని అన్నారు. అయినా.. తాను చరణ్ గురించి తప్పుగా మాట్లాడలేదని చెప్పారు. తండ్రి ఎవరన్నది ముఖ్యం కాదని, నువ్వేంటనేదే ముఖ్యమనే విషయాన్ని చెబుతూ.. తాను చరణ్ ప్రస్తావన తీసుకొచ్చానని గుర్తు చేశారు. ఒకవేళ నిజంగానే విమర్శించాలనుకుంటే.. తాను నేరుగా చిరంజీవితోనే చేస్తానని తెలిపారు. చరణ్ తండ్రి చిరంజీవి, దేవీశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి ఇద్దరూ తనకు మంచి స్నేహితులని యండమూరి వెల్లడించారు. నాగబాబు కూడా తనకు మంచి మిత్రుడేనని.. తాము అనేకసార్లు కలుసుకున్నామని చెప్పుకొచ్చారు. తనకు వ్యతిరేకంగా నాగబాబుకు ఎవరో తప్పుగా చెప్పి ఉంటారని యండమూరి అనుమానం వ్యక్తం చేశారు.

More from my site