Gossipsనితిన్...పవన్ కళ్యాణ్‌ని హర్ట్ చేయబోతున్నాడా? 

నితిన్…పవన్ కళ్యాణ్‌ని హర్ట్ చేయబోతున్నాడా? 

will tollywood young hero Nithin hurt power star pawan kalyan? As per the sources reveal that Nitin bought the Nijam rights for Nandamuri Balakrishna’s Gouthamiputra Sathakarni telugu movie. Chiranjivi’s Khaidi no. 150 movie will also be slated for release at the same time for Pongal 2017.

వరుసగా పదేళ్ళు ఫ్లాపులను మించిన ఫ్లాప్స్ ఎదుర్కున్న నితిన్ ఒక టైంలో హీరోగా ఫేడవుట్ అవుతాడేమో అన్న స్టేజ్‌కి వెళ్ళిపోయాడు. అయితే ఇష్క్ సినిమా మనవాడ్ని మళ్ళీ ట్రాక్ పైకి తీసుకొచ్చింది.పవన్ కళ్యాణ్‌పైన ఉన్న అభిమానం కూడా భలే కలిసొచ్చింది. ఆ తర్వాత ఆ అభిమానాన్ని పీక్స్‌లో వాడేసి గుండె జారి గల్లయ్యింతయ్యిందే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మెగా ఫ్యాన్స్‌కి కూడా దగ్గరయ్యాడు. అలాగే అఖిల్‌తో సినిమా ప్రొడ్యూస్ చేసి అక్కినేని ఫ్యామిలీకి కూడా నేను మిత్రుడినే అని చెప్పుకొచ్చాడు.

ఇప్పుడిక నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేశాడు నితిన్. బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి నైజాం రైట్స్ కొనేశాడు. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. బాలకృష్ణ సినిమాతో పాటే చిరంజీవి సినిమా కూడా సంక్రాంతికి నైజాంలో రిలీజ్ కానుంది. ఎలా అయినా థియేటర్స్ విషయంలో గొడవలు ఖాయం. మరి అప్పుడు నితిన్‌బాబు చిరంజీవి సినిమాకు నష్టం చేసి పవన్‌ని హర్ట్ చేస్తాడా? లేక తన లాభాలను తగ్గించుకుని అయినా చిరంజీవి సినిమానే ఎక్కువ థియేటర్స్‌లో పడేలాగా చేస్తాడా? చూడాలి మరి. అసలే మనవాడు పవన్ కళ్యాణ్‌ని వాడుకోవడం చూసి మెగా ఫ్యామిలీ హీరోలు కొంతమంది కాస్త ఫీలవుతూ ఉన్నారట. ఇప్పుడిక మెగాస్టార్ సినిమాకు ఏ కాస్త నష్టం జరిగినా సీన్ సితార అవడం ఖాయం. మెగా ఫ్యాన్స్ రెచ్చిపోవడం పక్కా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news