Moviesచిరంజీవి ఆ రికార్డుని కొట్టే హీరో ఎవరు?

చిరంజీవి ఆ రికార్డుని కొట్టే హీరో ఎవరు?

‘బాహుబలి’ పూర్తిగా వేరే లీగ్‌లో వుండడంతో, రికార్డులకి ఆ చిత్రాన్ని మినహాయించి మిగతా చిత్రాలకి టార్గెట్‌ సెట్‌ చేస్తున్నారు. ‘నాన్‌-బాహుబలి’గా చెప్పుకుంటోన్న ఈ రికార్డుని ముందుగా ‘శ్రీమంతుడు’తో మహేష్‌ సెట్‌ చేసాడు. దానిని ‘ఖైదీ నంబర్‌ 150’తో బిగ్‌ మార్జిన్‌తోనే క్రాస్‌ చేసాడు చిరంజీవి. బాహుబలి కాకుండా వంద కోట్ల షేర్‌ రాబట్టిన తెలుగు సినిమాగా ఈ చిత్రం రికార్డు సెట్‌ చేసింది.

అయితే అన్నయ్య పెట్టిన రికార్డుని తమ్ముడు రెండు నెలల్లోనే బీట్‌ చేసేస్తాడని కాటమరాయుడు గురించి అంచనా వేసారు కానీ అది తేడా కొట్టేసింది. పెట్టుబడినే రాబట్టుకోలేక రాయుడు చేతులెత్తేయడంతో ఇప్పుడు చిరు రికార్డుని బీట్‌ చేసే సినిమా ఏదంటూ చర్చ మొదలైంది. తదుపరి రాబోతున్న భారీ చిత్రాల్లో మహేష్‌23కి ఈ రికార్డు కొట్టే అవకాశాలు ఎక్కువ వున్నాయి.ఆ తర్వాత ఎన్టీఆర్ జై లవ కుశ , అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం ఇంకా రామ్ చరణ్ సుకుమార్ సినిమా ,పవన్ త్రివిక్రమ్ సినిమా …చూద్దాం ఏ సినిమా ఈ రికార్డుని క్రాస్ చేస్తుందో!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news