Moviesవినాయక్ సినిమాకి హీరో దొరికేసాడోచ్చ్.. (ముహూర్తం ఫొటోస్.)

వినాయక్ సినిమాకి హీరో దొరికేసాడోచ్చ్.. (ముహూర్తం ఫొటోస్.)

వి.వి. వినాయక్ లాంటి సెన్సషనల్ డైరెక్టర్ తో సినిమా అంటే ఎవరు అయినా ఎగిరి గంతులేస్తారు..ఇప్పుడు ఆ అదృష్టం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ను వరించింది. మెగా స్టార్ చిరంజీవితో ఖైదీ 150 తర్వాత వినాయక్ చేస్తున్న సినిమా ఇది. చిరుతో భారీ విజయం తర్వాత వినాయక్ ఎవరితో సినిమా చేస్తాడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేస్తున్నట్టు షాక్ వినాయక్ ఇచ్చాడు.

ఇప్పటివరకు విజయాల కంటే పరాజయాలు ఎక్కువగా మూటగట్టుకున్న ఈ మెగా హీరోకి వినాయక్ తో సినిమా అంటే కలిసొచ్చే విషయమే.ఈ సినిమాతో మాస్ హీరోగా ఇంకాస్త తన ఇమేజ్ ను పెంచుకోవడానికి సహకరిస్తుందని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని రేపు పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయనున్నారు. ప్రముఖ రచయిత ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ లు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.ఇక ఈ
సినిమా పూర్తి స్థాయిలో ఎప్పుడు మొదలయ్యేది…ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

vv vinayak new film with mega hero supreme star sai dharam tej
vv vinayak new film with mega hero supreme star sai dharam tej

DGxZK8EXcAAC9mk.jpg_large

DGxZH-FVYAAZxmW.jpg_large

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news