Gossips"ఉన్నది ఒకటే జిందగీ"రివ్యూ & రేటింగ్

“ఉన్నది ఒకటే జిందగీ”రివ్యూ & రేటింగ్

కేవలం కమర్షియల్ సినిమాలను నమ్ముకొని వరుస ప్లాప్స్ తో వున్నా యంగ్ ఎనేర్జిటిక్ హీరో రామ్ పోతినేని కి నేను శైలజ చిత్రం తో మంచి హిట్ ఇచ్చాడు దర్శకుడు కిషోర్ తిరుముల . హైపర్ తర్వాత రామ్ మరోసారి తిరుమల కిషోర్‌తో చేసిన సినిమా ఉన్నది ఒక్కటే జిందగీ, అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా శుక్రవారం వరల్డ్‌వైడ్‌గా ప్రీమియర్లు కంప్లీట్ చేసుకుంది.
కదా & ఎనాలిసిస్ :

ఈ సినిమా ఫ్రెండ్‌షిఫ్‌కు, ప్రేమకథకు సంబంధించింది . ఈ రెండిటిని దర్శకుడు బ్యాలెన్స్ చేస్తూ ఎమోషనల్ ట్విస్టులతో కథనాన్ని నడిపించాడు. సినిమా ఫస్టాఫ్ చూసుకుంటే డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో పాటు ప్రెష్‌ట్రీట్‌మెంట్‌తో కాస్త కొత్తగానే ఉంది. లవ్‌+ఫ్రెండ్‌షిఫ్ బేస్‌తో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చినా ఇక్కడ దర్శకుడు కిషోర్ ట్రీట్‌మెంట్ డిఫరెంట్‌గా ఉండడంతో ప్రేక్షకుడు ఆసక్తిగా సినిమాతో ట్రావెల్ చేస్తాడు. ఇంటర్వెల్‌లో వచ్చే ఎమోషనల్ ట్విస్ట్ తర్వాత సెకండాఫ్ ఇంకా అంచనాలు పెరుగుతాయి. ఓవరాల్‌గా ఫస్టాఫ్ అంతా డీసెంట్‌గానే ఉంటుంది.

ఇక కథకు కీలకమైన సెకండాఫ్‌లో కథ కాస్త గురి తప్పింది. సినిమా మరీ స్లో అవ్వడం ప్రేక్షకుడికి ఇబ్బందే. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. ఇక సినిమాలో రామ్ – అనుపమ పరమేశ్వరన్ నటనకు మంచి మార్కులే పడతాయి. దేవిశ్రీ మ్యూజిక్ రామ్ సినిమాలకు ఎప్పటిలాగానే ఆయువుపట్టుగా నిలిచింది. సినిమాకు ఎమోషనల్ సీన్లతో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్‌, క్లైమాక్స్ ప్లస్‌లుగా నిలిచాయి. ఓవరాల్‌గా అయితే సినిమా డీసెంట్‌గా ఉంది. క్లాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే కథనం కావడంతో ఈ సినిమా పూర్తి రిజల్ట్ రావాలంటే రివ్యూ వరకు వెయిట్ చేయాల్సిందే.

పెర్ఫార్మన్స్ :

రామ్ ఎనర్జీ చాల సినిమాల్లో చూసాం , కానీ నేను శైలజతో తనలో మరో యాంగిల్ ఉందని ప్రూవ్ చేసాడు రామ్, ఇక ఉన్నది ఒక్కటే జిందగీతో ఎలాంటి జానర్ కైన రామ్ పెఫెక్ట్ గా సెట్ అవుతాడని ప్రూవ్ చేసాడు . ఇక రామ్ ఫ్రెండ్ గా చేసిన శ్రీ విష్ణు కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు అని చెప్పాలి . హీరోయిన్లు అనుపమ , లావణ్య రామ్ కి తగ్గ కో స్టార్ లు అనిపించుకున్నారు . మిగిలిన నటులంతా వారి పరిధిలో పర్వాలేదు అనిపించుకున్నారు .

ఫ్రెండ్ షిప్ ని లవ్ ని మిక్స్ చేస్తూ అనేక సినిమాలు వచ్చాయి ఇప్పటివరకు , కానీ డైరెక్టర్ కిషోర్ తిరుముల ప్రెసెంట్ చేసిన విధానం చాల బిన్నంగా వుంది , ఎమోషనల్ కంటెంట్ అద్భుతం గ ఉందనే చెప్పాలి . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది . సాంగ్స్ వినడానికే కాదు చూడు కూడా చాల ప్లసెంట్ గా అనిపించాయి . దేవి మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది .

చివరిగా ”ఉన్నది ఒక్కటే జిందగీ” మంచి ఫీల్ గుడ్ మూవీ .

రేటింగ్ : 3.25/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news