Gossipsవిష్ణుకి గాయాలు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..!

విష్ణుకి గాయాలు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..!

మంచు విష్ణు హీరోగా జి. నాగేశ్వర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆచారి అమెరికా యాత్ర. సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఈ సినిమా షూటింగ్ లో మంచి విష్ణుకి యాక్సిడెంట్ అయ్యింది. బైక్ చేజ్ లో హీరోయిన్ ప్రగ్యాతో సహా బైక్ మీద నుండి కింద పడ్డాడు మంచు విష్ణు.

ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. మంచి విష్ణు స్వయాన తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాక కాని మంచు ఫ్యాన్స్ హమ్మయ్య అనుకోలేదు. అయితే ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఆచారి అమెరికా యాత్ర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనకు జరిగిన యాక్సిడెంట్ వీడియోని రిలీజ్ చేశాడు మంచు విష్ణు.

చూస్తుంటే బాగానే తగిలినట్టు ఉంది. బైక్ చేజింగ్ సీన్ లో అవతల వ్యక్తి బైక్ మంచు విష్ణు బైక్ వెనుక తగలడంతో బైక్ స్కిడ్ అయ్యి కింద పడ్డాడు. దెబ్బలు కూడా బాగానే తగిలినట్టు తెలిసింది. అయితే ఇలాంటి రిస్కీ షాట్స్ తీసేప్పుడు సాధారణంగా డూప్ ను వాడతారు కాకుండా ఆడియెన్స్ కు రియల్ స్టంట్స్ అనుభూతిని కలిగించాలని కొందరు హీరోలు అలా చేస్తుంటారు. ఏది ఏమైనా విష్ణు చిన్న దెబ్బలతోనే బయటపడటం మంచి విషయం. ఇక మీదట ఇలాంటి షాట్స్ చేసేప్పుడు తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆశిద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news