విశాల్, తమన్నాల ‘ఒక్కడొచ్చాడు’ మూవీ రివ్యూ, రేటింగ్

vishal okkadochadu movie review and rating tamanna

Here is the exclusive review of Hero Vishal’s latest film Okkadochadu. This film directed by Suraj and Tamanna bhatia romances with Vishal.

సినిమా : ఒక్కడొచ్చాడు
నటీనటులు : విశాల్, తమన్నా, జగపతిబాబు, సంపత్, వడివేలు, సూరి, తదితరులు
కథ – దర్శకత్వం : సురాజ్
నిర్మాత : జి.హరి
సంగీతం : హిప్‌హాప్ తమిళ
సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ఎమ్.నథన్
ఎడిటర్ : సెల్వ ఆర్కే
బ్యానర్ : మద్రాస్ ఎంటర్‌ప్రైజెస్
రిలీజ్ డేట్ : 23-12-2016

ఈ ఏడాదిలో ‘రాయుడు’తో డీసెంట్ హిట్ అందుకున్న హీరో విశాల్.. మరోసారి ‘ఒక్కడొచ్చాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సురాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశాల్ సరసన మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా నటించింది. ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌లకు రెస్పాన్స్ బాగానే రావడంతో.. దీనిపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి.. వాటిని అందుకోవడంలో ఈ చిత్రం సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం..

కథ :
డీజీపీ చంద్రబోస్ (జగపతిబాబు) ఒక ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్. ఇతనికి దివ్య (తమన్నా) అనే చెల్లెల్లు ఉంటుంది. కట్ చేస్తే.. ఒక చిన్న గ్రామానికి చెందిన అర్జున్ (విశాల్) సిటీకి వస్తాడు. దివ్యని చూసిన మొదటిచూపులోనే లవ్‌లో పడిపోతాడు. దివ్య కూడా అర్జున్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండానే అతనితో లవ్‌లో పడిపోతుంది. దివ్య తన ప్రేమ విషయం అన్నయ్య చంద్రబోస్‌కి తెలియజేయగా.. అతను వారి ప్రేమని అంగీకరిస్తాడు. పెళ్ళికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఆ సమయంలో అర్జున్ తానొక సీబీఐ ఆఫీసర్ అని చెప్తాడు. అంతేకాదు డీజీపీ దగ్గరనుండి 250 కోట్లు స్వాధీనం కూడా చేసుకుంటాడు.

వెంటనే అక్కడ పెద్ద ట్విస్ట్.. అసలు అర్జున్ సిబిఐ ఆఫీసర్ కాదని తెలుస్తుంది. అసలు అర్జున్ ఎవరు? అతని గతం ఏంటి? అతనికి కావాల్సింది ఏంటి? ఎందుకు సిబిఐ ఆఫీసర్‌గా నాటకమాడి అందరినీ నమ్మించాడు? డీజీపీ దగ్గర నుంచి 250 కోట్లు ఎందుకు స్వాధీనం చేసుకున్నాడు? అసలు డీజీపీ దగ్గర అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది? అర్జున్ లక్ష్యం ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా కథ సాగుతుంది.

విశ్లేషణ :
ప్రస్తుతం ప్రయోగాత్మక సినిమాల ట్రెండ్ నడుస్తుంటే.. విశాల్ మాత్రం రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలనే చేస్తున్నాడు. ఈసారి కూడా అదే పాత కథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సరే.. కథనం అయిన కొత్తగా ఉంటుందనుకుంటే అదీ లేదు. రెండు, మూడు ట్విస్టులు మినహా.. పెద్దగా ఆకట్టుకునే అంశాలేవీ లేవు. అదే యాక్షన్, అదే రొమాన్స్, అవే బోర్ కొట్టించే పాటలు.. అంతే!

ఫస్టాఫ్ విషయానికొస్తే.. ప్రీ-ఇంటర్వెల్ వరకు అసలు కథే ప్రారంభం కాదు. ఏదో సినిమా నడిపించాలి కదా అని.. అప్పటివరకు రొటీన్ కామెడీ, రొమాన్స్, బోరింగ్ సన్నివేశాలతో నడిపించేశారు. మధ్యలో వచ్చే పాటలు కూడా చికాకు తెప్పిస్తాయి. ఎక్కడైనా ఓ ట్విస్ట్ వస్తుందా? అనుకుంటే.. ఏదీ ఉండదు. కామెడీ ఎపిసోడ్స్ అక్కడక్కడ కాస్త నవ్విస్తే.. కొన్ని చోట్ల బోర్ కొట్టించేశాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరింది. అప్పటివరకు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన ఈ సినిమా.. ఆ ట్విస్ట్‌తో చాలా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. కానీ.. ఆ ఆసక్తిని సెకండాఫ్‌లో కంటిన్యూగా నిలబెట్టలేకపోయారు. ద్వితీయార్థం కూడా అదే కామెడీ, యాక్షన్ సీన్లతో సాగుతుంది. తమన్నా రెండు, మూడు సీన్లలో మెరుపుతీగలా మెరిసి వెళ్ళిపోతుంది. కొన్ని చోట్ల బలవంతంగా కామెడీ ఎపిసోడ్స్ జోడించారు. వడివేలు కాసేపు నవ్వించినా.. ఆ తర్వాత కథకు సంబంధం లేకుండా బోర్ కొట్టించింది. క్లైమాక్స్ ఎపిసోడ్ ఊహాజనితంగానే ఉంది.

ఓవరాల్‌గా చూస్తే.. మొదటి ఐదు నిముషాలు, ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్‌గా నిలిచాయి. మిగతా సినిమాని రొడ్డకొట్టుడు కొట్టి.. బోర్ కొట్టించేశారు. కొన్నిచోట్ల కామెడీ నవ్వించినా.. మరికొన్ని చోట్ల చికాకు తెప్పించింది. పాటలైతే సినిమాని మరింత చిరాకుగా తయారు చేశాయి. ఈ సినిమాలో ప్లస్ కంటే మైనస్ పాయింట్లే ఎక్కువ.

నటీనటుల పనితీరు :
హీరో విశాల్ ఎప్పట్లాగే తన ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. డ్యాన్స్, యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడు. మిల్కీబ్యూటీ తమన్నా ఇందులో చాలా అందంగా కనిపించడంతోపాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. పాటల్లో అయితే ఈ అమ్మడు తన అందాలను బాగానే ఆరబోసింది. డీజీపీ చంద్రబోస్‌గా జగపతి, దేవాగా సంపత్ మంచి నటనే కనబరించారు. మిగతా నటీనటులు తమతమ పాత్రల పరిధి ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక పనితీరు :
రిచర్డ్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా.. కార్ ఛేజ్ లాంటి సన్నివేశాలను తన కెమెరాలో బాగా బంధించాడు. హిప్‌హాప్ తమీళ సంగీతం ఫర్వాలేదనిపించినా.. కొరియోగ్రఫి లోపంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎడిటింగ్ బాగోలేదు. నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టలేం. ఇక దర్శకుడు సురాజ్ గురించి మాట్లాడితే.. ఆడియెన్స్‌ని మెప్పించడంలో ఫెయిల్ అయ్యాడు. సెకండాఫ్‌తో కాస్త ఫర్వాలేదనిపించాడు కానీ.. ఫస్టాఫ్ మరీ బోరింగ్‌గా తెరకెక్కించాడు.

ఫైనల్ వర్డ్ : పాత చింతకాయ పచ్చడే!
‘ఒక్కడొచ్చాడు’ మూవీ రేటింగ్ : 2.25/5

More from my site

Share Your Thoughts

comments