Gossipsఅర్జున్‌రెడ్డి సిక్స్ ఫ్యాక్ వెన‌క అస‌లు క‌థ ఇదే..

అర్జున్‌రెడ్డి సిక్స్ ఫ్యాక్ వెన‌క అస‌లు క‌థ ఇదే..

విజయ్ దేవరకొండ .. ఈ పేరుకంటే అర్జున్ రెడ్డి అంటేనే బాగా తెలుస్తుంది మన సినీ జనాలకు అంతగా ఆ సినిమాతో పాపులర్ అయిపోయిన విజయ్ ఒక్కసారిగా స్టార్ హీరో స్టేటస్ సంపాదించేసుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ప్రతిష్టాత్మక చిత్రం మహానటిలో ఏఎన్నార్ పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అలనాటి దేవదాసు పాత్రలో ఈ మోడ్రన్ దేవదాసు నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

తనకు సన్నిహితుడైన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెండోసారి విజయ్ నటిస్తున్నాడు. అయితే తాజాగా విజయ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. సిక్స్ ప్యాక్ కోసం జిమ్ ట్రైనర్ దగ్గర జాయిన్ అయ్యా అంటూ విజయ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో మంచి పాపులర్ అయిపొయింది. ట్రైనర్ కులదీప్ వద్ద శిక్షణ పొందుతున్నా. నా శరీరంతో ప్రయోగం చేస్తున్నా. ఈ ప్రయోగం ద్వారా ఏం జరుగుతుందో చూద్దాం అంటూ విజయ్ సిక్స్ ప్యాక్ కోసం హార్డ్ వర్క్ చేస్తున్న స్టిల్స్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు విజయ్

విజయ్ దేవరకొండ మరో ఛాలెంజ్ కు అంగీకరించాడు. ‘అర్జున్ రెడ్డి’ సిక్స్ ప్యాక్ చేసేందుకు 360 డిగ్రీస్ ఫిట్ నెస్ కు అంగీకరించాడు’ అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే విజయ్ సిక్స్ ప్యాక్ చేస్తున్నది మహానటి చిత్రం కోసమా ? లేక వేరే చిత్రం కోసమా అన్న సంగతి మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇక అర్జున్‌రెడ్డి సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో మ‌నోడికి వ‌రుస‌గా అవ‌కాశాలు త‌న్నుకుంటూ వ‌స్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news