News'తాతయ్య చిల్'.. విజయ్ దేవరకొండ ఏంటి ఈ అతి..!

‘తాతయ్య చిల్’.. విజయ్ దేవరకొండ ఏంటి ఈ అతి..!

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో హీరో పాత్ర విపరీతమైన కోపం, యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిగా విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. సినిమాలో పాత్రే కాదు ప్రమోషన్స్ లో కూడా విజయ్ దేవరకొండ అదే రకమైన యాటిట్యూడ్ తో కనిపిస్తున్నాడని రూమర్స్ వస్తున్నాయి.

ఇక వాటిని నిజం చేస్తున్నాయి విజయ్ దేవరకొండ పనులు. రిలీజ్ అవుతున్న అర్జున్ రెడ్డి లిప్ లాక్ పోస్టర్స్ ఎక్కడబడితే అక్కడ కనిపిస్తున్నాయి. బస్సుల మీద కూడా ఈ పోస్టర్స్ కనిపించడంతో కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతురావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు తన అనుచరులతో బస్సుల మీద ఉన్న అర్జున్ రెడ్డి పోస్టర్స్ ను చింపించేస్తున్నాడు. ఈ వ్యవహారంపై విజయ్ దేవరకొండ మాత్రం తాతయ్య చిల్ అంటూ స్పందించడం విశేషం.

ఇది కచ్చితంగా విఎచ్ ను వెటకరిస్తున్నట్టే అని భావిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఈ అతికి ఎవరు ఎలా అయినా సరే రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. దానికి సర్ది చెప్పే ప్రయత్నం చేయకుండా విజయ్ ఇలా రెస్పాండ్ అవడం అందరిని ఆశ్చర్యపరచింది. మరి ఈ న్యూస్ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news