Gossipsవెంకటేష్ తో త్రివిక్రం.. హిట్టు కాంబినేషన్ గురూ..!

వెంకటేష్ తో త్రివిక్రం.. హిట్టు కాంబినేషన్ గురూ..!

విక్టరీ వెంకటేష్ విజయ భాస్కర్ కాంబినేషన్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చవ్, మళ్లీశ్వరి సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఆ సినిమా దర్శకుడు విజయభాస్కరే అయినా ఆ సినిమాకు కథ మాటలను అందినంచింది మాత్రం త్రివిక్రం శ్రీనివాస్. త్రివిక్రం పనితనం ఆ సినిమాలతోనే తెలిసింది. అయితే దర్శకుడిగా మారాక వెంకటేష్ తో కలిసి సినిమా చేసే అవకాశం రాలేదు.

ఇన్నాళ్లకు ఆ క్రేజీ కాంబినెషన్ సెట్ అయ్యింది. ప్రస్తుతం త్రివిక్రం అజ్ఞాతవాసి సినిమా కాగానే ఎన్.టి.ఆర్ తో సినిమా ముహుర్తం పెట్టాడు. ఇక ఆ తర్వాత సినిమా వెంకటేష్ తో తీస్తున్నట్టు తెలుస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెంకటేష్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేశారు.

మాటల రచయితగా ఉన్నప్పుడే త్రివిక్రం సత్తా ఏంటో చూపించగా.. ఇప్పుడు తన దర్శకత్వంలో సినిమాతో సూపర్ హిట్ ఇచ్చి మరోసారి వారి కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. వెంకటేష్ ప్రస్తుతం తేజ డైరక్షన్ లో ఆట నాదే వేట నాదే సినిమా చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news