Gossipsఖాళీగా ఉంటే వెంకీ కి అదేపనా..?

ఖాళీగా ఉంటే వెంకీ కి అదేపనా..?

ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో వెంకటేష్ ‘విక్టరీ’ అనేది అయన ఇంటిపేరుగా మార్చుకున్నాడు.
ఫ్యామిలీ కథలే కాకుండా విభిన్న కథలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న వెంకటేష్..ప్రస్తుతం తేజ దర్శకత్వం లో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇంతకీ వెంకటేష్ కాళీ సమయాల్లో ఏమి చేస్తాడో తెలుసా ..? ఇదే విషయాన్నీ ఆయన్ను అడిగితే ఆధ్యాత్మిక విషయాలు గురించి ఆలోచిస్తానని , ఈ మధ్యనే ఆధ్యాత్మిక గురువు రమణ మహర్షిని కలవడం జరిగిందని , ఆయన నుండి ఎన్నో మంచి మాటలు తెలుసుకున్నాని, అప్పటి నుండి తీరిక దొరికినప్పుడల్లా అక్కడికే వెళ్తున్న అని చెప్పుకొస్తున్నాడు ఈ విక్టరీ హీరో.

తేజ మూవీ తో పాటు మలయాళ సినిమాలో ఓ పాత్ర చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ లో మెయిన్ హీరో గా మోహన్ లాల్ నటిస్తుండగా , ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు వెంకీ. ఈ మూవీ మలయాళం లో తెరకెక్కబోతుంది. ఆ తర్వాత తెలుగు లో డబ్ అవుతుందా కదా అనేది ప్రస్తుతం తెలియనప్పటికీ , ఈ మూవీ కానుకగా తెలుగు లో కూడా రిలీజ్ అయితే ఆ క్రేజ్ వేరు అంటున్నారు. ఇక ఈ మూవీ కి డైరెక్టర్ ఎవరు..మిగతా నటి నటులెవరు అనేది ఇంకా అయితే బయటకి రాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news