Moviesమూడు రోజుల్లో కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన మెగా హీరో..!..ఏరియాల వారీగా...

మూడు రోజుల్లో కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన మెగా హీరో..!..ఏరియాల వారీగా లెక్కలు

మెగా హీరో నాగ బాబు తనయుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ సినిమాలైతే చేస్తున్నాడు కాని ఇప్పటిదాకా కమర్షియల్ సక్సెస్ అయితే కొట్టలేదు. ఫిదాతో ఆ హిట్ దాహం తీర్చుకోవాలనుకున్న వరుణ్ తేజ్ హిట్ మాత్రమే కాదు సూపర్ హిట్ కలక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఫిదా శుక్రవారం రిలీజ్ అయ్యి మొదటి షో నుండి మంచి టాక్ సొంతం చేసుకుంది.

సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 25 కోట్ల కలక్షన్స్ వసూలు చేసి సరికొత్త ప్రభంజనాలు సృష్టిస్తుంది. మెగా హీరో ఇమేజ్ ఉన్నా ఈ సినిమాను లిమిటెడ్ థియేటర్స్ లోనే రిలీజ్ చేశారు. అయినా సరే ఫిదా కలక్షన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక ఏరియాల వారిగా ఫిదా కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

నైజాం-4.34 కోట్లు, సీడెడ్ 1.19 కోట్లు, వైజాగ్ 1.20, గుంటూర్ 81 లక్షలు, ఈస్ట్ 76 లక్షలు, వెస్ట్ 54 లక్షలు, కృష్ణా 66 లక్షలు, నెల్లూరు 29 లక్షలు.. మొత్తంగా 9.80 కోట్లు తెలుగు రెండు రాష్ట్రాల్లో కలెక్ట్ చేయగా కర్ణాటక 1 కోటి, రెస్ట్ ఆఫ్ ఇండియా 25 లక్షలు, ఓవర్సీస్ 3.25 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా మొదటి మూడు రోజులకే వరుణ్ తేజ్ ఫిదా 25.5 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూలు చేసింది. అంటే ఇప్పటిదాకా 14.42 కోట్లు షేర్ వసూలు అయ్యిందన్నమాట. ఇక సోమవారం కూడా ఫిదా సందడి అలానే కొనసాగుతుందని తెలుస్తుంది. చూస్తుంటే వరుణ్ తేజ్ కెరియర్ లో ఇదో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news