Reviewsవరుణ్ తేజ్ 'ఫిదా' రివ్యూ.. 100% శేఖర్ మార్కు సినిమా.....

వరుణ్ తేజ్ ‘ఫిదా’ రివ్యూ.. 100% శేఖర్ మార్కు సినిమా.. 110% సాయి పల్లవి కోసం చూడండి

కథ : తన తండ్రి మరియు అక్క తో సరదాగా జీవితం గడుపుతున్న ఒక చిలిపి భానుమతి అనే అమ్మాయి (సాయి పల్లవి) కథ.భానుమతి అక్క కి ఒక NRI తో పెళ్లి జరుగుతుంది. ఆ NRI తమ్ముడే మన హీరో వరుణ్ (వరుణ్ తేజ్). ఆ పెళ్ళిలోనే మన హీరో భానుమతి ప్రేమలో పడిపోతాడు.కానీ భానుమతి మాత్రం వరుణ్ కలలు వేరు అని గుర్తించటంతో పాటు తనతో ప్రయాణం కష్టం అని తెలుసుకుంటుంది. భానుమతి కూడా పెళ్లి చేసుకుని తన ఊళ్ళోనే తన తండ్రి (సాయి చంద్ ) తో పాటె ఉండాలని కలలు కంటుంది. అలా వరుణ్ ప్రేమని తిరస్కరిస్తుంది మన భానుమతి. ఒక సందర్భంలో అమెరికా కి వెళ్లిన భానుమతి ప్రేమని వరుణ్ ఎలా సాధించాడు అనేదే మిగతా కథ.

విశ్లేషణ: ఫిదా మొదటి భాగం చాలా బాగుంది.. ఎమోషనల్ గా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతూ చాలా బాగా సాగింది. అలాగే అన్ని విభాగాల ప్రేక్షకులని రంజింపచేస్తూ కథా గమనం వేగంగా నడుస్తుంది. ఫ్రెష్ లొకేషన్లు.. సూపర్ పెరఫార్మన్సెస్ కలగలిపి ఫస్ట్ హాఫ్ చాలా బాగా వచ్చింది.ఇంటర్వెల్ ఎపిసోడ్ మారియు పాటలు మేజర్ హైలైట్స్.

ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి కొంత నిరాశ కలిగించింది. కొన్ని కొన్ని చోట్ల ఎమోషనల్ గా కనెక్ట్ చెయ్యటంలో విఫలం అయింది. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ అర్థ గంట అలా అలా సాగిపోయి ఏమాత్రం ప్రేక్షకులకి వినోదాన్ని అందించదు.ఇక అప్పటినుండి మాత్రం మరల పుంజుకొని ఫస్ట్ హాఫ్ లో ఉన్న రేంజ్ కి స్టోరీని తీసుకువెళ్లాడు మన శేఖర్ కమ్ముల.క్లైమాక్స్ కి ముందు వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. క్లైమాక్స్ మాత్రం సింపుల్ గా ముగించాడు.

పెర్ఫార్మన్స్: సాయి పల్లవి సినిమా కి మొదటి ఆస్థి. తన బుజాల మీదే ఈ సినిమా మొత్తాన్ని నడిపించిందనటంలో ఏమాత్రం సందేహం లేదు. తన పెర్ఫార్మన్స్ కి ఎక్కడా కూడా వంక పెట్టటానికి లేదు. తెలంగాణ అమ్మాయిగా జీవించేసింది. వరుణ్ తేజ్ చాలా సింపుల్ గా చేసుకుంటూ వెళ్ళాడు. మిగతా పాత్రల్లో చేసిన సాయి చంద్, రాజా, శరణ్య ప్రదీప్ లు వాళ్ళ వాళ్ళ పాత్రలకి 100% న్యాయం చేసారు.

ఇక సాంకేతిక విభాగానికి వస్తే కథ చాలా సింపుల్ గా మరియు డీసెంట్ గా ఉంది. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది.సెకండ్ హాఫ్ లో కొంతభాగం నిరాశ పరిచింది. పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి సాయి పల్లవి తర్వాత ప్రాణాలు అని చెప్పవచ్చు. ఫోటోగ్రఫీ చాల సహజంగా ఉంటూ కలర్ ఫుల్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మొత్తానికి శేఖర్ కమ్ముల తన సహజ సిద్ద సినిమా తో మరల ఫిదా ని తన కం బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు.

ఫైనల్ వర్డ్ : సాయి పల్లవి మరియు శేఖర్ కమ్ముల గురించి ఈ సినిమా మీ ఫ్యామిలీ తో సహా వెళ్లి చూడవచ్చు.

రేటింగ్ : 3.0/5.0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news