Moviesఅక్కడ యు ఎస్ లో.. ఇక్కడ నైజాం లో.. ఫిదా...

అక్కడ యు ఎస్ లో.. ఇక్కడ నైజాం లో.. ఫిదా సంచలనాల లెక్క..!

మెగా హీరో హిట్ కొడితే ఏ రేంజ్ లో ఉంటుందో చూపించాడు మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ్. ముకుందతో తెరంగేట్రం చేసిన వరుణ్, ‘ఫిదా’ సినిమా తో మొదటి కమర్షియల్ హిట్ సాధించాడు. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తుంది. రిలీజ్ అయిన వారాంతరంలోనే యూ ఎస్ లో 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసిన ఫిదా. 2 మిలియన్ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదనిపిస్తుంది.

ఇక నైజాంలో కూడా ఫిదా సంచలనాలు సృష్టించడం విశేషం. మెగా అభిమానుల సహకారంతో ఫిదా వరుణ్ తేజ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది. ఇప్పటికే నైజాంలో ఫిదా 10 కోట్ల షేర్ సాధించడగా ఇప్పటికి కలక్షన్స్ స్టడీగా ఉన్నాయి. ఇక ఇదే జోరు కొనసాగిస్తే ఫుల్ రన్ లో ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం 25 కోట్ల షేర్ తో దూసుకెళ్తున్న ఫిదా ఫుల్ రన్ లో 35 కోట్ల దాకా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

భానుమతిగా సాయి పల్లవి ఆడియెన్స్ మనసులు కొల్లగొట్టగా ఎన్నారైగా వరుణ్ తేజ్ తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మరోసారి శేఖర్ మార్క్ హిట్ అందుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news