Gossipsవర్మ దీపావ‌ళి రోజు ఇంత దారుణమా?

వర్మ దీపావ‌ళి రోజు ఇంత దారుణమా?

ఏం చేసినా త‌న‌కంటూ ఓ మార్క్ కోరుకునే వ్య‌క్తి రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఈ దీపావ‌ళి సంగ‌తి త‌న‌కు తెలియ‌ద‌ని వ‌చ్చే దీపావ‌ళికి మాత్రం ఎన్టీఆర్ ఆత్మ ల‌క్ష్మీ బాంబులు పేల్చ‌డం ఖాయ‌మ‌ని పేర్కొంటూ అంద‌రికీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపాడు.సోష‌ల్ మీడియాలో చేసిన  ఈ పోస్టు వైర‌ల్ అవుతోంది.గతంలో వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర బెజవాడ వంగవీటి సినిమాల విడుదలకు ముందు కొన్ని వివాదాలు వచ్చినా ఈ స్థాయిలో కాంట్రవర్సీలు కామెంట్లు రాలేదు.

 

కానీ ఈ సినిమాకు మాత్రం లెక్క‌కు మిక్కిలి వివాదాలు వ‌చ్చి ప‌డుతున్నాయి. తాజాగా ఏపీసీఎం చంద్ర‌బాబు సైతం వ‌ర్మ‌పై కామెంట్లు చేయొద్ద‌ని, వాస్త‌వాలేంట‌న్న‌ది ప్ర‌జ‌ల‌కు తెలుసు అని త‌మ్ముళ్ల‌ను వారించిన విష‌యం విధిత‌మే! మొత్తంగా సినిమా రాక‌మునుపే త‌న‌దైన కాంట్ర‌వ‌ర్సీని సినిమా లెవ‌ల్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు వ‌ర్మ‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news