Gossipsవర్మ నాగార్జున కాంబినేషన్..! మొత్తం ఆ సినిమా స్టోరీ కాపీ

వర్మ నాగార్జున కాంబినేషన్..! మొత్తం ఆ సినిమా స్టోరీ కాపీ

పాతికేళ్ల తర్వాత ఓ క్రేజీ కాంబినేషన్ సినిమా షురూ అయ్యింది. శివగా సంచలనాలు సృష్టించిన రాం గోపాల్ వర్మ, నాగార్జునల కలయికలో మరో సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ముహుర్తపు షాట్ నిన్న జరిగింది. సినిమా గురించి నాగార్జున చెబుతూ వర్మ ఇప్పటిదాకా చేసిన సినిమాల కన్నా ఇది కొత్తగా ఉంటుంది. యూనిక్ సబ్జెక్ట్ తో ఈ సినిమా వస్తుందని అన్నాడు.

సినిమాలో నాగ్ పోలీస్ గా నటిస్తున్నాడని తెలిసిందే. ఇక నిన్న అలా మొదలయ్యిందో లేదో ఈరోజు ఆ సినిమా కథ కాపీ అంటూ హడావిడి మొదలైంది. ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో వర్మ ఈ సినిమా కథ రాసుకున్నాడని అంటున్నారు. 2008లో వచ్చిన హాలీవుడ్ మూవీ టేకెన్ కథను కాపీ కొట్టి వర్మ ఈ సినిమా చేస్తున్నాడని లేటెస్ట్ రూమర్. యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఆ సినిమాలో లియం నీసన్ హీరోగా చేశారు.

కిడ్నాప్ అయిన కూతురిని కాపాడుకునే తండ్రి కథ ఆ సినిమా. హాలీవుడ్ లో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద విజయం దక్కించుకుంది. ఇప్పుడు ఆ సినిమా కథనే రాము కాపీ చేశాడంటూ వార్తలు వస్తున్నాయి. మరి వర్మ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news