Gossipsమెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునే న్యూస్.. ఉయ్యాలవాడకు ముహుర్తం కుదిరింది.. పర్ఫెక్ట్...

మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునే న్యూస్.. ఉయ్యాలవాడకు ముహుర్తం కుదిరింది.. పర్ఫెక్ట్ డేట్..!

మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150 సూపర్ హిట్ అవడంతో మెగాస్టార్ తర్వాత మూవీ మీద కూడా అంచనాలు పెంచుకున్నారు మెగా ఫ్యాన్స్. పదేళ్ల తర్వాత కూడా తన స్టైల్ లో ఏమాత్రం తేడా రాలేదని చూపించిన మన మెగాస్టార్ ఖైదితో మరోసారి తన సత్తా ఏంటో చూపించారు. ఇక ఖైది నంబర్ 150 తర్వాత మెగాస్టార్ చేయబోయే 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.

స్వాతంత్ర్య సమరయోధుని జీవిత చరిత్రను సినిమా కథగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు కథ అందించగా సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కానిచ్చేస్తున్న చిత్రయూనిట్ సినిమాను ఆగష్టు 22న చిరు పుట్టినరోజున స్టార్ట్ చేయాలని చూశారు. కాని స్వాతంత్ర్య సమరయోధుని చరిత్ర కాబట్టి ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా స్టార్ట్ చేస్తారని అంటున్నారు.

అయితే ఆగష్టు 22 చిరు పుట్టినరోజు కొన్ని సర్ ప్రైజెస్ రివీల్ చేస్తారని తెలుస్తుంది. సినిమా ముహుర్తం నాడే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ఐశ్వర్య రాయ్, నయనతార హీరోయిన్స్ గా నటించనున్న ఈ సినిమా తెలుగు తమిళ హింది భాషల్లో తెరకెక్కనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news