Gossipsఉపాసనకు ఆ రాత్రి నిద్ర లేకుండా చేశారు..!

ఉపాసనకు ఆ రాత్రి నిద్ర లేకుండా చేశారు..!

స్వీటీ అనుష్క లీడ్ హీరోయిన్ గా అశోక్ డైరక్షన్ లో వచ్చిన థ్రిల్లర్ మూవీ భాగమతి. యువి క్రియేషన్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా ఈ ఇయర్ టాలీవుడ్ క్రేజీ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తిన ఈ సినిమా కథ కథనాలు కలక్షన్స్ వర్షం కురిసేలా చేస్తున్నాయి. ఇక ఈ సినిమా చూసిన సిని సెలబ్రిటీస్ ఎంతోమంది చిత్రయూనిట్ హార్డ్ వర్క్ ను పొగిడారు.

ఇక ఇప్పుడు ఈ సినిమా చూసిన చరణ్ అయితే వెరైటీగా ఉపాసనకు నిద్ర లేకుండా చేసినందుకు థ్యాంక్స్ అంటూ విచిత్రమైన కామెంట్ పెట్టాడు. సతీసమేతంగా భాగమతి సినిమా చూసిన చరణ్ సినిమా యూనిట్ అంతటికి కంగ్రాట్స్ చెప్పారు. అనుష్క అద్భుతంగా నటించిందని.. ఇక సినిమా చూసి ఉపాసన నిద్ర పోలేదని తన ఎఫ్.బి పేజ్ లో మెసేజ్ పెట్టారు.

సినిమా ఎఫెక్ట్ వల్ల ఉపాసన నిద్రపట్టలేదా లేక మరేమో కాని చరణ్ పెట్టిన ఈ సరదా మెసేజ్ భాగమతి టీం కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. బాహుబలి తర్వాత అనుష్క అందుకున్న అద్భుతం విజయం ఇది. జనవరు 26న రిలీజ్ అయిన ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూళు చేసిందని టాక్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news