Gossips' ఉన్న‌ది ఒక్క‌డే జింద‌గీ' 10 రోజుల షేర్‌... లాభ‌మా...న‌ష్ట‌మా

‘ ఉన్న‌ది ఒక్క‌డే జింద‌గీ’ 10 రోజుల షేర్‌… లాభ‌మా…న‌ష్ట‌మా

యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టించిన లేటెస్ట్ మూవీ ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ. నేను శైల‌జ ఫేం తిరుమ‌ల కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా గ‌త శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. సినిమాకు మంచి టాక్ వ‌చ్చినా క్లాస్ సినిమా కావ‌డంతో జిందగీ బీ, సీ సెంట‌ర్ల‌లో అంత ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. ఇక ఫ‌స్ట్ వీకెండ్ వ‌సూళ్ల ప‌రంగా బాగానే ఉన్న జింద‌గీ పది రోజులు వచ్చేప్పటికి 15.3 కోట్లు షేర్ మాత్రమే చేసింది.

జింద‌గీ 10 డేస్ షేర్స్ వివ‌రాలు ఇలా ఉన్నాయి (రూ.కోట్ల‌లో)
నైజాం – 5.45

సీడెడ్ – 1.98

ఉత్తరాంధ్ర – 1.80

గుంటూరు – 0.96

ఈస్ట్ – 1.0

వెస్ట్ – 0.68

కృష్ణా – 0.99

నెల్లూరు – 0.36
——————————-
ఏపీ + తెలంగాణ = 13.22
——————————-

రెస్ట్ అఫ్ ఇండియా – 1.20

ఓవర్సీస్ – 1.10
—————————————-
వరల్డ్ వైడ్ షేర్ = 15.52 ( కోట్లు )
—————————————-

ఇక ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.19 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇప్పటి వ‌ర‌కు 15.5 కోట్లు రాబ‌ట్ట‌డంతో ఇక మిగిలిన రూ 3.5 కోట్ల‌ను ఈ సినిమా రాబ‌ట్టాల్సి ఉంది. మ‌రి ఈ సినిమా ఎంత వ‌ర‌కు బ్రేక్ ఈవెన్‌లోకి వ‌స్తుందో ?  చూడాలి. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అయితే జింద‌గీ చాలా స్లో అయిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news