ఇదేనా నా స్వాతంత్ర్య భారతావనికి అర్థం.. ఒంటరి అమ్మాయిపై ఇద్దరు కామాంధుల దుశ్చర్య (వీడియో)

bangalore molestation

బెంగళూరు లోని కమ్మనహళ్లి ప్రాంతంలో ఇద్దరు కామాంధులు ఒక వీధిలో ఒంటరిగా వెళుతున్న అమ్మాయిపై బలవంతంగా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన వీడియో ఒకటి ANI మీడియా బయట పెట్టింది.ఆ వీడియోలో మన భారతీయ సహోదరుల దుశ్చర్యలు చూస్తుంటే.. “తెల్లోళ్ళ పాలనలో కూడా ఇన్ని దారుణాలు జరగలేదేమో అనిపిస్తుంది”.

కామంతో కళ్ళు మూసుకుపోయి.. అమ్మాయి కనిపిస్తే చాలు పశువులకన్నా హీనంగా ప్రవర్తించే కుక్కలని(అవి కూడా సిగ్గు పడతాయేమో) చూస్తుంటే..ఇదేనా నా స్వాతంత్ర్య భారతావనికి అర్థం అనిపిస్తుంది.

మందు పైనే నడిచే ప్రభుత్వాలు.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పే నీచ రాజకీయనాయకులు.. అమ్మాయిల డ్రెస్ ని బట్టే మగ కుక్కల బుద్ధి మారుతుందంట.. చదువుని ‘కొనే’ రోజుల్లో ఇలాంటి సమాజం కాక మరి ఎటువంటి సమాజం మనకి లభిస్తుంది.

కుక్కల వలె.. పందుల వలె.. మందు కొట్టిన మానవుడా..
నీ తల్లి ఒక ఆడదే అని మరచితివా… అమ్మాయి ఒక మనిషే అన్న ఇంగితం కోల్పోయితివా…

More from my site