Newsభార్య చెల్లెలు చేసిన పనికి.. తననితాను తుపాకితో కాల్చుకున్న ప్రముఖ...

భార్య చెల్లెలు చేసిన పనికి.. తననితాను తుపాకితో కాల్చుకున్న ప్రముఖ టీవీ నటుడు

TV actor Kamlesh Pandey who acted as cop in Crime Patrol serial was fired himself with revolver. Read below story what is the reason.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అ..ఆ’ సినిమాలో ‘శత్రువులు ఎక్కడో కాదు.. మన ఇంట్లోనే ఉంటారు’ అని చెప్పిన డైలాగ్‌లాగే ఓ ఘటన జరిగింది. తన భార్య చెల్లెలు చేసిన పనికి తట్టుకోలేకపోయిన ఓ ప్రముఖ టీవీ నటుడు.. తనని తాను తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోనీ టీవీలో ప్రసారమయ్యే ‘క్రైమ్ పెట్రోల్’ సీరియల్‌లో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన కమలేష్ పాండే తన భార్యతో జబల్‌పూర్‌లో ఉంటున్నాడు. ఇతని భార్య సోదరి అయిన అంజనీ ఇటీవల తన కూతురి పెళ్ళి ఘనంగా జరిపించింది. అయితే.. ఈ పెళ్ళికి కమలేష్‌ని పిలవలేదు. దీంతో అవమానంగా భావించిన కమలేష్.. సీరియల్ షూటింగ్ ముగించుకుని జబల్‌పూర్‌కి చేరుకున్నాడు. ఫుల్లుగా మద్యం తాగి.. అంజనీ ఇంటివద్దకు వెళ్ళి తనని పెళ్ళికి ఎందుకు పిలవలేదని గొడవ చేశాడు.

ఇదే సమయంలో తన దగ్గరున్న రివాల్వర్ తీసి మొదట గాలిలో కాల్పులు జరిపాడు. అతంతరం తనని తాను ఛాతిపై కాల్చుకున్నాడు. దాంతో.. కమలేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news