Gossipsత్రివిక్రమ్ -ఎన్టీఆర్ సినిమా టైటిల్..మీ ఊహలకు కూడా అందదు...

త్రివిక్రమ్ -ఎన్టీఆర్ సినిమా టైటిల్..మీ ఊహలకు కూడా అందదు బాసూ !!

ఎన్నాళ్ల నుండో నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఎన్.టి.ఆర్ త్రివిక్రం మూవీ సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమైంది. పవన్ చేతుల మీదుగా ముహుర్తం పెట్టుకున్న ఈ సినిమా మార్చి నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్లబోతుంది. ఇక ఈ సినిమా లో ఎన్.టి.ఆర్ కొత్త లుక్ లో కనిపిస్తాడట. అంతేకాదు ఈ లుక్ కోసం ఇప్పటికే జిం ట్రైనర్ ను పెట్టుకున్నాడని తెలుస్తుంది.

ఈ సినిమా టైటిల్ గా ఆన్ సైలెంట్ మోడ్ అన్నది ప్రచారంలో ఉంది. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ రేంజ్ కు తగ్గ టైటిల్ లా కాకున్నా కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది ఈ సినిమా టైటిల్. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా టైటిల్ అది కాదని కేవలం అది ట్యాగ్ లైన్ మాత్రమే అని అంటున్నారు. ఇక సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దెని ఫైనల్ చేశారట.

అజ్ఞాతవాసి అనిరుద్ నిరాశ పరచగా.. ఈ సినిమాకు డిఎస్పితో కంటిన్యూ అవుదామని అనుకున్నారట. ఫైనల్ గా క్రేజీ కాంబినేషన్ తో పాటుగా క్రేజీ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా కచ్చితంగా అంచనాలకు తగినట్టే ఉంటుందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news