Gossipsకర్ణాటకలో తొలిరోజు కలక్షన్ల దుమ్మురేపిన టాప్ 10 సౌత్ సినిమాలివే..!

కర్ణాటకలో తొలిరోజు కలక్షన్ల దుమ్మురేపిన టాప్ 10 సౌత్ సినిమాలివే..!

భాషతో సంబందం లేకుండా ఈమధ్య సినిమాలన్ని దుమ్ముదులిపేస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ సినిమా తొలిరోజు కలక్షన్స్ పై అందరి గురి ఉంటుంది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ అన్న తేడాలేకుండా వసూళ్ల సునామి సృష్టిస్తున్నాయి. ఆ క్రమంలోనే కర్ణాటకలో తొలి రోజు కలక్షన్స్ తో షేక్ చేసిన టాప్ 10 మూవీ గురించి మనం చూద్దాం.

బాహుబలి-2 10. 40 కోట్లు : బాహుబలి పార్ట్ 2గా వచ్చిన ఈ సినిమా తొలి రోజు వసూళ్ల సునామి సృష్టించింది. రాజమౌళి దర్శకత్వం ప్రతిభ, ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణల నటన అందరిని ఆశ్చర్యపరచింది. ఈ సినిమా తొలి రోజు కర్ణాటకలో హయ్యెస్ట్ కలక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. అంతేకాదు శాండల్ వుడ్ సినిమాలు కూడా సాధించలేని రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది.

ఇక టాప్ 2 లో శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన రాజకుమార. తొలిరోజు ఈ సినిమా 7.15 కోట్ల కలక్షన్స్ తో దుమ్మురేపింది. బాహుబలి కాకుండా అక్కడ భాషలో వచ్చి వసూళ్ల హంగామా చేసిన తొలి సినిమా ఇదే..

కర్ణాటకలో తొలి రోజు కలక్షన్స్ లో దుమ్మురేపిన సినిమా బాహుబలి ది బిగినింగ్. ఈ సినిమా 6.12 కోట్ల వసూళ్లతో టాప్ 3 ప్లేస్ ల్ఫో నిలిచింది.

పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా కర్ణాటకలో తొలి రోజు కలక్షన్స్ లో టాప్ 4 లో నిలిచింది. అజ్ఞాతవాసి సినిమా 5.14 కోట్ల కలక్షన్స్ తో టాప్ 4లో నిలిచింది.

ఆ తర్వాత కర్ణాటకలో 5వ స్థానంలో నిలిచిన సినిమా జై లవ కుశ. 4.51 కోట్లతో యంగ్ టైగర్ జై లవ కుశ సత్తా చాటింది.

ఇక 4.48 కోట్లతో మెగాస్టార్ చిరంజీవి ఖైది నంబర్ 150 సినిమా టాప్ 6లో నిలిచింది. కత్తి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా మెగాస్టార్ స్టామినా ఏంటో మళ్లోసారి ప్రూవ్ చేసింది.

సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన కబాలి సినిమా 4.08 కోట్లతో టాప్ 7లో నిలిచింది. కర్ణాటకలో తొలిరోజు కలక్షన్స్ లో వసూళ్ల హడావిడి చేసిన సినిమాల్లో కబాలి 7వ స్థానంలో నిలిచింది.

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన మాస్టర్ పీస్ సినిమా 3.40 కోట్లతో కర్ణాటకలో తొలిరోజు హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాల్లో 8వ స్థానంలో నిలిచింది.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన 25వ సినిమా చక్రవ్యూహ్ సినిమా తొలి రోజు 3.34 కోట్లతో టాప్ 9 వ స్థానంలో నిలిచింది.

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా 3.30 కోట్లతో కర్ణాటక తొలిరోజు హయ్యెస్ట్ కలక్షన్స్ సాధించిన సినిమాల్లో టాప్ 10లో 10వ స్థానంలో నిలిచింది.

http://www.telugulives.com/telugu/ntr-trivikram-new-update/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news