Gossipsబాలీవుడ్ బాట‌లో కుర్ర‌హీరో

బాలీవుడ్ బాట‌లో కుర్ర‌హీరో

ఒక్క‌సినిమా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకున్నాడు కుర్ర హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ

అటుపై సెలక్టివ్‌గా మూవీస్ చేస్తూ పెద్ద నిర్మాత‌లంద‌రికీ చేరువవుతూ ఇండ‌స్ట్రీలో

హాట్ టాపిక్ గా మారాడు. తాజాగా మ‌నోడు బాలీవుడ్ త‌ర‌హాలోనే లావిష్ పార్టీలు

ఎరేంజ్ చేస్తూ.. త‌న స‌ర్కిల్ ని పెంచుకునేందుకు ట్రై చేస్తున్నాడు.

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి పాఠాలు నేర్పిన ఈ హీరో ప్రస్తుతం పార్టీలతో చాలా బిజీగా ఉన్నాడు. సినిమా హిట్ అయిన తర్వాత పెద్ద బ్యానర్ నుంచి ఆఫర్స్ కూడా బాగానే వస్తున్నాయి. దీంతో మనోడు సినీ ఇండస్ట్రీ ప్రముఖులతో ఇంకా దగ్గరవ్వాలని సర్కిల్ పెంచుకునేందుకు లావిష్ పార్టీలు ఇస్తు న్నాడు. కుర్ర హీరోలనే కాకుండా.. దర్శకులతో కూడా బాగా క్లోజ్ గా ఉంటున్నాడు. ఈ మధ్యనే.. వెంకటేష్.. రానా..సాయిధర మ్ తేజ్.. నానిలకు..తన తల్లీతండ్రితో కలసి ఒక పార్టీ ఇచ్చాడు.బాలీవుడ్ లో ఇలాంటి క‌ల్చ‌ర్ ఎక్కువుగాఉంది.

ఇప్పుడు విజయ్ కూడా అదే తరహాలో చేస్తూ.. బడా హీరోలని లైన్ లో పెడుతున్నట్లు టాలీవుడ్ లో టాక్. అయితే ఆల్రెడీ విజయ్ సీనియర్ హీరో వెంకీతో కలసి ఒక మల్టీస్టారర్ చేస్తాడని తెలుస్తోంది.అదేవిధంగా మెగా క్యాంపులోనూ చోటు ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. మొన్న‌నే వీ4 బ్యాన‌ర్ పై అల్లూ అర‌వింద్ బ‌న్నీవాసు లాంటి టాప్ ప్రొడ్యూస‌ర్లు క‌లిసి నెక్స్ట్ నువ్వే అనే కాన్సెప్ట్ మూవీని తీశారు. ఈ ఆడియో వేడుక‌కు వ‌చ్చి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు విజ‌య్‌.త్వ‌ర‌లోనే బ‌న్నీవాసుతో కూడా ఈ కుర్ర‌హీరో ప‌నిచేయ‌నున్నాడ‌ని స‌మాచారం.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news