Gossips7వ సినిమా తో.. టాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన హీరోలు..!

7వ సినిమా తో.. టాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన హీరోలు..!

స్టార్ హీరోల సినిమాల విషయంలో ఒక్కో సినిమాకు ఒక్కో లెక్క ఉంటుంది. ఇక స్టార్ సినిమాల 7వ సినిమా చరిత్ర సృష్టించిన దాఖలాలు ఉన్నాయి. పవన్, ఎన్.టి.ఆర్, మహేష్ ఈ ముగ్గురు హీరోల 7వ సినిమాలు టాలీవుడ్ హిస్టరీలో నిలిచిపోయే విజయాలను అందుకున్నాయి. ఇంతకీ ఏంటా సినిమాలు అంటే..

పవన్ 7వ సినిమా ఖుషి.. యూత్ ఆడియెన్స్ కు చిన్నగా ఎక్కిన ఆ సినిమా పవన్ క్రేజ్.. ఇమేజ్ రెండిటిని అలా పెంచేసింది. పవన్ కెరియర్ లో ఖుషి సినిమా 20 కోట్ల కలక్షన్స్ సాధించిన మొదటి సినిమా అని చెప్పొచ్చు. ఇక ఎన్.టి.ఆర్ 7వ సినిమా సింహాద్రి కూడా తారక్ కెరియర్ లో అద్భుతమైన విజయం అందుకున్న సినిమా అని అందరికి తెలిసిందే. రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాతో 26 కోట్ల షేర్ వసూలు చేసి ఎన్.టి.ఆర్ స్టార్ గా నిలబడ్డాడు.

ఇక వీరితో పాటుగా మహేష్ 7వ సినిమా కూడా చరిత్ర సృష్టించింది. అదే ఒక్కడు. గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఒక్కడు సినిమా కూడా 20 కోట్ల పైగా కలక్షన్స్ సాధించింది. అయితే 7వ సినిమా మహేష్, పవన్, ఎన్.టి.ఆర్ లకు చరిత్రలో నిలిచిపోయే సినిమాలను ఇవ్వగా ప్రభాస్ 7వ సినిమా పౌర్ణమి, అల్లు అర్జున్ 7వ సినిమా ఆర్య-2 అంతగా ఆడలేదు. అయితే చరణ్ 7వ సినిమా ఎవడు మాత్రం పర్వాలేదు అన్నట్టు ఆడింది. మొత్తానికి స్టార్ సినిమాల జాబితాలో 7వ సినిమాకు ఓ రికార్డ్ ఉంది. రాబోతున్న స్టార్ల ఈ 7వ సినిమా ఫేట్ ఎలా ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news