Specialsమన పుట్టిన తేదీతో ఆర్థిక సంపాదన మెరుగుపరుచుకోవచ్చు.. ఎలాగో మీరే చూడండి!

మన పుట్టిన తేదీతో ఆర్థిక సంపాదన మెరుగుపరుచుకోవచ్చు.. ఎలాగో మీరే చూడండి!

There are some tips are available to increase our wealth with the help of birth date. According to the numbers theory, our birth dates play major part in wealth. This is mentioned by pandits in history.

ప్రతిఒక్కరూ బాగా సంపాదించుకుని, ప్రశాంతంగా జీవితం గడపాలని కోరుకుంటారు. కానీ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అది అసాధ్యం. మనిషి డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు కానీ.. వాటికోసం నిత్యం పరుగులు పెడుతూనే ఉన్నాడు. అంటే.. కష్టంతోపాటు ఫలితం కూడా దక్కుతోంది కానీ, సుఖం మాత్రం లేదు. దేనికోసమైతే జీవితంలో పోరాడుతున్నాడో.. అది తప్ప మిగతావన్నీ అనుభవిస్తున్నాడు. జీవితంలో సుఖం కూడా పొందాలంటే.. కొన్ని సూత్రాలను పాటిస్తే చాలని పురాతన సంఖ్యాశాస్త్రం తెలుపుతోంది.

ఆ శాస్త్రం ప్రకారం.. పుట్టిన తేదీ ఆర్థికపరమైన విజయాల్లో ప్రధానపాత్ర పోషిస్తుందని, విజయాల రహస్యం పుట్టినరోజును బట్టి వుంటాయని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. అలాగే.. మానవ జీవితం ‘కర్మ, అదృష్టం’ అనే రెండు ప్రధానాంశాలపై ఆధారపడి ఉంటుందని వారంటున్నారు. ఈ రెండింటిలో కర్మ తన చర్యలు, పనులు, ఉద్దేశాలపై ప్రభావం చూపితే.. అదృష్టంపై జ్యోతిషశాస్త్రం, వేద విఙ్ఞానం ప్రభావం ఉంటుంది. హిందూ జ్యోతిషశాస్త్రం ప్రకారం… పుట్టిన సమయం, తేది, రోజు, నెల, సంవత్సరాన్ని బట్టి వ్యక్తిగతంగా జన్మ పట్టికను తయారుచేస్తారు. ఇది జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలియజేస్తుంది. ఆ సంఖ్యలు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయని పురాతన హిందూ మత గ్రంథాల్లో ఆ కాలం నాటి పండితులు పేర్కొన్నారు.

పురాణాల ప్రకారం ప్రతి ఒక్కరికి మూడు సంఖ్యలు ఉంటాయి. అవి జననం, అదృష్ట సంఖ్య, పేరు. ఓ వ్యక్తి జనన సంఖ్య ఒకటి అనుకుంటే, దాన్ని ఉపయోగించి అతను పుట్టిన నెలలోని రోజును లెక్కిస్తారు. దీన్ని అతను పుట్టిన తేది, నెల, ఏడాదిని కలిపి లెక్కిస్తారు. ఉదాహరణకు ఓ వ్యక్తి 21 మార్చి 1990లో జన్మించాడనుకుంటే.. అతని అదృష్ట సంఖ్య 2+1+0+3+1+9+9+0 = 25: 2+5= 7.

ఈ తరహాలోనే పుట్టిన తేదీతో ఆర్థికంగా, సుఖంగా ఎలా ఉండొచ్చో లెక్కగట్టొచ్చు.
– పుట్టిన తేదీ 1 అంకెతో ముడిపడి ఉంటే.. చుట్టూ ఉన్నవారిని మీరు సంతోషంగా ఉంచుతారు. ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
– పుట్టిన తేదీ 2 అంకెతో ముడిపడి ఉంటే.. సోమవారం ఉపవాసం ఉండండం మంచిది. అలా కుదరని పక్షంలో.. ఆరోజు ఉప్పును స్వీకరించాలి. ఇలా చేస్తే ఓ మంచి ఫలితం దక్కుతుంది.
– పుట్టిన తేదిలో 3 అంకె ఉంటే.. గురువారం పసుపు రంగు దుస్తులు ధరించండి. దీనివల్ల అదృష్టం రెట్టింపవుతుంది.
– పుట్టిన తేది 4 అంకెతో ముడిపడి ఉంటే.. గణేశుడ్ని పూజించండి. ప్రతిరోజూ పూజిస్తే.. జీవితంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి.
– పుట్టిన తేదిలో 5 అంకె ఉంటే.. ప్రతి బుధవారం ఆవులకు బెల్లం, పచ్చగడ్డి తినిపించడంతోపాటు విఘ్నేశ్వర స్తోత్రాన్ని స్మరించండి. ఇలా చేస్తే.. విజయాలు మీ వెంటే ఉంటాయి.
– పుట్టిన తేదిలో 6 అంకె ఉంటే.. గురువారం ఏదైనా స్వీట్ తీసుకుని, లక్ష్మీ అష్టోత్తరాన్ని స్మరించాలి. ఇలా చేయడం వల్ల.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
– పుట్టిన తేదిలో 7 అంకె ఉంటే.. నల్లరంగులో ఉన్న కుక్కలకు భక్తితో ఆహారం అందించి, శివునికి అభిషేకం చేయాలి. ఫలితంగా.. అంతా మంచే జరుగుతుంది.
– పుట్టిన తేది 8 అంకెతో ముడిపడి ఉంటే.. రావి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించాలి. అగరువత్తులతో శని దేవుని పూజించాలి. అంతేకాదు.. మద్యం, మాంసాహారాన్ని పూర్తిగా వదిలేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే.. ఆర్థికంగా మెరుగుపడడంతోపాటు సుఖంగా ఉండొచ్చు.
– పుట్టిన తేదిలో 9 ఉంటే.. ప్రతి మంగళవారం అంజనేయుడిని భక్తితో కొలవాలి. అలాగే హనుమాన్ చాలీసాను పఠించాలి. ఇలా చేస్తే.. ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news