Moviesతొలిప్రేమ కలక్షన్స్.. వరుణ్ తేజ్ సత్తా చాటాడు

తొలిప్రేమ కలక్షన్స్.. వరుణ్ తేజ్ సత్తా చాటాడు

వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా తొలిప్రేమ. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పోటీగా సాయి ధరం తేజ్ ఇంటిలిజెంట్ మూవీ ఓరోజు ముందే వచ్చినా అది ఏమాత్రం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేదు. ఇక లవ్ స్టోరీగా వచ్చిన తొలిప్రేమ మాత్రం హిట్ కొట్టింది.

ఫిదా హిట్ తర్వాత వరుణ్ తేజ్ హిట్ ట్రాక్ కు కొనసాగించేలా తొలిప్రేమ వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి రోజే 5.12 కోట్ల పైన షేర్ సాధించిందగా.. వీకెండ్ లో 9 కోట్ల పైగా వసూళ్లను రాబట్టిందని తెలుస్తుంది. ఓవర్సీస్ లో ఇప్పటికే హాఫ్ మిలియన్ క్రాస్ చేసిందట. మొత్తానికి వరుణ్ తేజ్ కు కమర్షియల్ గా మరో సూపర్ హిట్ దక్కింది.

బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశాడు. 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన ఈ సినిమా చూస్తుంటే నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్ కు మంచి లాభాలు తెచ్చేలా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news