Moviesసప్తగిరి ‘ఎక్స్‌ప్రెస్’ ముందు కొట్టుకుపోయిన ఇతర సినిమాలు.. థియేటర్లు పెంపు

సప్తగిరి ‘ఎక్స్‌ప్రెస్’ ముందు కొట్టుకుపోయిన ఇతర సినిమాలు.. థియేటర్లు పెంపు

50 Theatres hiked for Saptagiri Express movie after getting huge response from audience. This movie also earning at the domestic boxoffice than other films.

గత శుక్రవారం ‘వంగవీటి’, ‘ఒక్కడొచ్చాడు’, ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సినిమాలు రిలీజవ్వగా.. ఆ తర్వాత శనివారం ‘పిట్టగోడ’ విడుదల అయ్యింది. ఈ నాలుగు సినిమాలు మంచి అంచనాల మధ్యే విడుదల అయ్యాయి. దీంతో.. వీటిలో ఏది బాక్సాఫీస్ వద్ద నిలకడగా నిలబడుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. దానికి తెరదించుతూ సప్తగిరినే తన సత్తా చాటుకున్నాడు.

తొలిరోజు ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. కామెడీ చాలా బాగుండడంతో జనాలు దీనికే బ్రహ్మరథం పట్టారు. ‘ఒక్కడొచ్చాడు’ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం, ‘వంగవీటి’కి డివైడ్ టాక్ రావడంతోపాటు అది మాస్ ప్రేక్షకులకే అంకితం కావడం, ‘పిట్టగోడ’ చిన్న సినిమా కావడంతో.. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’కి బాగా కలిసొచ్చింది. దీంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్‌తో చెడుగుడు ఆడుకుంటోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ ఫస్ట్ వీకెండ్‌లో రూ.3 కోట్ల షేర్, రూ.5 కోట్లపైనే గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఓ కామెడీ చిత్రానికి ఈ రేంజులో వసూళ్లు రావడం రికార్డని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మరో విశేషం ఏమిటంటే.. సప్తిగిరి సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ వస్తుండడంతో థియేటర్ల సంఖ్య కూడా పెంచారు. తొలుత ఈ చిత్రాన్ని 300 థియేటర్లలో రిలీజ్ చేయగా.. ఇప్పుడు 50 థియేటర్లు పెంచామని స్వయంగా నిర్మాత రవికిరణ్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాదిలో‘బిచ్చగాడు’, ‘పెళ్ళిచూపులు’ తర్వాత ఈ ఫీట్ అందుకున్న మూడో చిన్న చిత్రంగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా.. తమ చిత్రానికి ఇంతటి ఊహించని విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత రవికిరణ్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news