Gossipsఅప్పుడే ముగిసిపోలేదు..అసలు కథ తెలిస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి...

అప్పుడే ముగిసిపోలేదు..అసలు కథ తెలిస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకాలే !!

ఎన్నో అంచనాలతో సంక్రాంతి కి రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా అటు సాధారణ తెలుగు సినిమా అభిమానులతో పాటు డై హార్డ్ పవన్ కళ్యాణ్ అభిమానులని కూడా నిరాశ పరచిన సంగతి తెలిసిందే. 200 కోట్ల క్లబ్ లో సునాయాసంగా చేరుతుందనుకున్న అజ్ఞాతవాసి చివరకు టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ మూవీ గా చరిత్ర కెక్కిన సంగతి తెలిసిందే. ఫెయిల్యూర్ మాత్రమే కాకుండా కాపీ వివాదాలు కూడా చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ మరో సినిమా ఆలోచన ఇప్పట్లో లేదన్న విషయం కూడా తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ మీద నమ్మకంతో కోట్లకి కోట్లు కుమ్మరించిన డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు వారికి వచ్చిన నష్టాలని పూడ్చుకునే మార్గం గురించి దిల్ రాజు సారధ్యంలో ఒక సమావేశం ఏర్పాటుచేసుకుని చర్చించినట్లు సమాచారం.

దిల్ రాజు కి కూడా దాదాపుగా 15 కోట్ల రూపాయలకి పైగా లాస్ వచ్చింది. దీంతో దిల్ రాజు తనకి పవన్ కళ్యాణ్ తో ఉన్న అనుబంధం తో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ లతో పర్సనల్ గా ఈ నష్టాలని పూడ్చె విషయమై చర్చించి ఫైనల్ గా ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేలా తన నిర్మాణ సారధ్యంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేసేలా ఒప్పించినట్లు సమాచారం. చాలా తక్కువ రోజులు పవన్ కళ్యాణ్ షూట్ లో పాల్గొనేలా తమ మధ్య ఒప్పందం జరిగినట్లు సమాచారం. దీంతో దిల్ రాజు మంచి పవర్ ఫుల్ కథ ని చెక్కేలా తన శాయశక్తులు దారబోస్తున్నాడట. ఈ సినిమా కూడా ఎలెక్షన్లకి ముందు గానే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారంట.

గత సినిమాలలో మాదిరిగా కాకుండా పవన్ కళ్యాణ్ పాత్ర మంచి పవర్ ఫుల్ గా ఉంటూ ఇటు కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా కథని చెక్కే పనిలో పడ్డారట దిల్ రాజు సైన్యం. ఏది ఏమైనప్పటికి ఎలెక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ నుండి మంచి పవర్ ఫుల్ సినిమా కనుక వస్తే ఆ కిక్కే వేరబ్బా!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news