Moviesచైనా లో బాహుబలి ఎందుకు ప్లాప్ అయ్యింది

చైనా లో బాహుబలి ఎందుకు ప్లాప్ అయ్యింది

బాహుబలి: ది బిగినింగ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా పేరు తో పాటు డబ్బులని కూడా బాగా సంపాదించిపెట్టింది. కానీ చైనాలో మాత్రం పరాజయం పాలయ్యింది. దానికి కారణాలేంటో సినిమా నిర్మాత శోభు మాటల్లోనే..‘‘బాహుబలి: ది బిగినింగ్ చైనాలో ఆడకపోవడానికి కారణాలున్నాయి. చైనా మార్కెట్ చాలా భిన్నంగా ఉంటుంది. మన సినిమాల్ని వాళ్లకు చేరువ చేయడం అంత సులువు కాదు. వాళ్లకు ఇండియన్ సినిమాలు అలవాటు లేదు. ఎక్కువగా లోకల్ సినిమాలు.. హాలీవుడ్ మూవీస్ చూస్తారు. మేం ‘బాహుబలి: ది బిగినింగ్’ను చాలా ఆలస్యంగా రిలీజ్ చేశాం. అప్పటికే ఆన్ లైన్లోకి సినిమా వచ్చేసింది. దీనికి తోడు రిలీజ్ టైమింగ్ కూడా బాలేదు. మేం ఆశించిన థియేటర్లు.. ఎక్కువ స్క్రీన్లు దక్కలేదు. ఐతే ఆ అనుభవం పాఠాలు నేర్పింది. బాహుబలి-2 విషయంలో ఈ తప్పులు జరగకుండా చూసుకుంటాం. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా చైనాలో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. స్థానిక డిస్ట్రిబ్యూటర్ ఇప్పట్నుంచే రిలీజ్ కోసం సన్నాహాలు మొదలుపెట్టాడు. మంచి టైమింగ్‌లో భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేయాలనుకుంటుున్నాం’’ అని శోభు అన్నారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news