Gossipsసై రా లోని పవర్ ఫుల్ డైలాగ్ ... వింటే రోమాలు...

సై రా లోని పవర్ ఫుల్ డైలాగ్ … వింటే రోమాలు నిక్కబొడవాల్సిందే..మీసం తిప్పాల్సిందే!!

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఎంతో అట్టహాసంగా జరిగిన ఫంక్షన్ లో దర్శకధీరుడు రాజమౌళి చేతులమీదుగా చిరు 151 వ సినిమా “సై రా నరసింహారెడ్డి” లోగో లాంచ్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఆ “సై రా నరసింహారెడ్డి” సినిమా లోగో మరియు మోషన్ పోస్టర్ కి అపూర్వ స్పందన లభించింది. యూట్యూబ్ లో మోషన్ పోస్టర్ ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉంది.

ఈ సినిమా “సై రా నరసింహారెడ్డి” పేరు ప్రకటించక ముందు ఎన్నో పేర్లు వినిపించాయి. కానీ టీమ్ చివరకు “సై రా నరసింహారెడ్డి” కి వోట్ వేసింది. టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇప్పుడు “సై రా నరసింహారెడ్డి” సినెమాలోదంటూ ఒక డైలాగు సోషల్ మీడియా లో విపరీతంగా హల్ చల్ చేస్తుంది.

“ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా, నువ్వు భుజం మీద తుపాకీతో వచ్చావ్.. అయినా నా చెయ్యి మీసం మీదకి పోయే సరికి నీ బట్టలు తడిసిపోతున్నాయిరా” అన్న డైలాగ్ అభిమానుల మీసం మెలేసాల ఉంది. స్వతంత్ర సమరయోధుని కథతో మన ముందుకు వస్తున్న చిరంజీవి సినిమా గురించి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. వర్క్ ఔట్లు కానీ తన బాడీ లాంగ్వేజ్ విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాలోని డైలాగులు తప్పకుండా అశేష అభిమానులని అలరించేవిధంగా ఉండేలా అటు పరుచూరి బ్రదర్స్ ఇటు మూవీ యూనిట్ చాలా కష్టపడుతున్నారంట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news