Moviesతమన్ "తారక్, త్రివిక్రమ్" ల ట్రిపుల్ ట్రెండింగ్ చేస్తున్నాడుగా..!

తమన్ “తారక్, త్రివిక్రమ్” ల ట్రిపుల్ ట్రెండింగ్ చేస్తున్నాడుగా..!

ఓ పక్క మెగా నందమూరి కాంబినేషన్ లో ట్రిపుల్ ‘ఆర్’ ట్రెండింగ్ లో ఉండగా మరో పక్క తమన్ ట్రిపుల్ ‘టి’ ని అదే రేంజ్ ట్రెండింగ్ లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంతకీ ఈ ట్రిపుల్ ‘టీ’ కాన్సెప్ట్ ఏంటంటే.. త్రివిక్రం, తారక్, తమన్ అన్నమాట. రామ్ చరణ్, రామారావు, రాజమౌళి ట్రిపుల్ ‘ఆర్’ తెలుసు. కాని ఈ ట్రిపుల్ ‘టి’ మాత్రం కొత్తగా ఉంది.

ఈ ముగ్గురు మొదటిసారి కలిసి సినిమా చేస్తున్నారు. త్రివిక్రం డైరక్షన్ లో మూవీకి సంగీతాన్ని అందించాలని తమన్ ఎన్నాళ్ల నుండో ట్రై చేస్తున్నాడట. కాని కుదరలేదు ఎలాగోలా తారక్ సినిమాతో అది కుదిరింది. అందుకే త్రివిక్రం, తారక్, తమన్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రుపుల్ ఆర్ కు ధీటుగా హ్యాష్ ట్యాగ్ ట్రిపుల్ టి ని ప్రమోట్ చేస్తున్నాడు.

ఈమధ్యనే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టిన త్రివిక్రం, తారక్, తమన్ నవ్వుతూ ఉన్న ఓ సర్ ప్రైజ్ పిక్ షేర్ చేస్తూ ట్రిపుల్ టి ట్రెండింగ్ అయ్యేలా చేస్తున్నాడు. మరి రాజమౌళి ట్రిపుల్ ఆర్ కి పోటీగా ఈ ట్రిపుల్ ఆర్ ఉంటుందా లేదా అన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం. ఈమధ్యనే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా దసరా బరిలో దించాలని చూస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాకు అసామాన్యుడు అన్న టైటిల్ పరిశీలణలో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news