Specialsహోస్ట్ గా ఎన్టీఆర్ గా బిగ్ బాస్ అదుర్స్..!

హోస్ట్ గా ఎన్టీఆర్ గా బిగ్ బాస్ అదుర్స్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే ఇక ఆయన చేస్తున్న అభినయం గురించి రీసెంట్ గా బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన సమీర్ చెబుతూ తారక్ ను ఆకాశానికెత్తేస్తున్నాడు. తారక్ తో పర్సనల్ రిలేషన్ ఉన్న సమీర్ హోస్ట్ గా చాలా పరిణితిచెందిన వాడిలా మాట్లాడటం అద్భుతమని అన్నారు.

అంతేకాదు హోస్టింగ్ అంతా ఓ సినారియోలో జరుగుతుంటే అక్కడ హౌజ్ మెట్స్ చెప్పిన విషయానికి స్పాంటేనియస్ గా సమాధానం చెప్పాలి. ఇక వారు చెప్పేది నిజమా కాదా అన్నది కూడా కనిపెట్టాల్సి ఉందని. నిజంగా తారక్ ను బిగ్ బాస్ హోస్ట్ గా పెట్టాలని ఆలోచన ఎవరికి వచ్చిందో ఏమో కాని వారికి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాలి. అసలు తనకు తెలిసిన తారక్ హోస్ట్ గా చేస్తున్న తారక్ కు చాలా మెచ్యూరిటీ వచ్చిందని అన్నారు సమీర్.

టాలీవుడ్ టాప్ లీగ్ స్టార్ గా ఉన్న తారక్ ఓ రియాలిటీ షోకి హోస్ట్ గా అది కూడా మొదటి ఎపిసోడ్ నుండే దుమ్ము దులిపేయడం బహుశా మరే హీరో వల్ల కాదేమో.. దేన్నైనా సరే పోటీతత్వంతో తీసుకునే తారక్ బిగ్ బాస్ హోస్టింగ్ లో కూడా తనకు తిరుగులేదు అనిపించుకున్నాడు. అంతేకాదు సమీర్ చెప్పినట్టుగా స్మాల్ స్క్రీన్ రియాలిటీ షోస్ లో 16.7 టి.ఆర్.పి రేటింగ్ వచ్చిన మొదటి షో బిగ్ బాస్ అవడం అది కేవలం తారక్ వల్లే అని చెప్పేయొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news