Newsభానుమతి కి కె.సి.ఆర్ ఫిదా.. చిత్రయూనిట్ కు తెలంగాణా సిఎం...

భానుమతి కి కె.సి.ఆర్ ఫిదా.. చిత్రయూనిట్ కు తెలంగాణా సిఎం సర్ ప్రైజ్..!

శుక్రవారం రిలీజ్ అయిన ఫిదా ఆడియెన్స్ మనసులను గెలుచుకోవడమే కాదు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మనసుని ఫిదా అయ్యేలా చేసింది. ఫిదా చూసిన కె.సి.ఆర్ చిత్రయూనిట్ కు తన ప్రశంసలు అందించారు. ఈ సినిమాకు ప్రత్యేకంగా హీరోయిన్ భానుమతి అదేనండి సాయి పల్లవి తెలంగాణా అమ్మాయిగా భాషా యాసతో అభినయం కనబరచింది.

ఈమధ్య హీరోయిన్స్ తో తెలంగాణా యాసని పలికించేలా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు తెలంగాణాకు చెందిన వారు కావడం చేత సినిమా మీద మరింత ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. సినిమా చూసిన కె.సి.ఆర్ సినిమా యూనిట్ అందరిని మెచ్చుకోవడంతో పాటుగా వారందరికి తన అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ప్రేక్షకులు మెచ్చిన సినిమా తీయడమే కాదు ప్రజా ప్రతినిధులను మెప్పించే సినిమా తీయడం గొప్ప విషయం. ఆ విషయంలో ఫిదా తప్పక అందరిని ఫిదా చేస్తుంది. ముఖ్యంగా సాయి పల్లవి నటన కోసం రిపీటెడ్ ఆడియెన్స్ వస్తున్నారని తెలుస్తుంది. సినిమాకు మంచి టాక్ రావడమే ఆలస్యం రిలీజ్ అయిన తెల్లారి నుండి థియేటర్లు కూడా పెంచారట. మొత్తానికి వరుణ్ తేజ్ కెరియర్ లో ఫిదా ఓ మంచి కమర్షియల్ హిట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news