Newsపెళ్ళి చేసుకుంటానని.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని పలుమార్లు రేప్ చేసి.. నిండా దోచేశాడు

పెళ్ళి చేసుకుంటానని.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని పలుమార్లు రేప్ చేసి.. నిండా దోచేశాడు

A software engineer girl has been raped and cheated by amit jadhav who met her through matrimony website.

కొందరు ఆకతాయిలు చెప్పే మాయమాటలకు అమ్మాయిలు దారుణంగా మోసపోతున్నారు. ప్రేమ, పెళ్ళి అనే మాటలు వినగానే.. ముందూవెనకా ఆలోచించకుండా వారి మాయలో పడి.. అన్నీ సమర్పించేసుకుంటున్నారు. ఇలాగే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక యువతి.. ఓ టెక్కీ మాయలో నిండా మోసపోయింది. అతగాడు ఆమెని పలుమార్లు రేప్ చేయడంతోపాటు.. భారీ నగుదు తీసుకుని ఉడాయించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పూణే నగరంలో నివాసముంటున్న అమిత్ జాదవ్ ఓ మ్యాట్రీమోని వెబ్‌సైట్‌లో తాను సాప్ట్‌వేర్ ఇంజనీరుననంటూ ప్రకటన ఇచ్చాడు. అది చూసిన ఓ సాప్ట్‌వేర్ ఇంజనీరు అయిన ఓ యువతి.. అతగాడ్ని సంప్రదించింది. ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకొని ప్రతిరోజూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఒకరోజు అమిత్ ఉన్నట్లుండి తాను ఐటీ కంపెనీ తరపున రెండేళ్ల కోసం విదేశాలకు వెళుతున్నానని, ఈ లోగా నిశ్చితార్థం చేసుకుందామని, తన ఫ్లాటుకి రమ్మని ఆ యువతిని పిలిచాడు. అప్పటికే అతని మాయమాటలకు పడిపోయిన ఆ యువతి.. నిశ్చితార్థం మాట వినగానే అతడ్ని పూర్తిగా నమ్మింది. అమిత్ చెప్పినట్లుగా అతడి ఫ్లాట్‌కి వెళ్ళింది. అలా వచ్చిన ఆ యువతిని అమిత్ బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఆమెపై పలుసార్లు అత్యాచారం జరిపాడు. అనంతరం తన వీసా కోసమంటూ ఆ యువతి నుంచి భారీ డబ్బులు తీసుకున్నాడు. రెండు నెలల గడిచాక.. తమకి పెళ్లి జరగడం కుదరదని, తమ మధ్య బంధాన్ని తెంచుకుంటున్నట్లు అమిత్ చెప్పాడు. అంతేకాదు.. ఆ యువతి వద్దనుంచి తీసుకున్న డబ్బులు సైతం ఇవ్వనని చెప్పాడు.

దీంతో తాను నిండా మోసపోయాయని గుర్తించిన ఆ యువతి.. అమిత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి పోలీసులు దిగగా.. మరో యువతితో అమిత్ అడ్డంగా దొరికిపోయాడు. విచారణలో భాగంగా పోలీసులకు దిమ్మతిరిగే విషయం తెలిసిందే. ఫిర్యాదు చేసిన యువతిని మోసగించినట్లుగానే.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో నలుగురు యువతులపై అమిత్ అత్యాచారం చేసి, మోసం చేశాడని దర్యాప్తులో తేలింది. దీంతో.. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news