Gossipsబాహుబలిని కొట్టేదాకా వారికి నిద్ర పట్టదేమో..!

బాహుబలిని కొట్టేదాకా వారికి నిద్ర పట్టదేమో..!

బాహుబలి సినిమా అది ఇండియన్ సినిమాగా ప్రాచుర్యం పొంది ప్రపంచ దేశాలకు ఇండియన్ సినిమా స్థాయిని తెలియచేసినా.. బాలీవుడ్ సిని జనాలు మాత్రం అది తెలుగు సినిమానే అంటారు. ఒక తెలుగు సినిమా తమ సినిమాలను దాటి ఆ రేంజ్ లో హిట్ అవ్వడం వారికి నచ్చలేదు. అందుకే ఏదో పొడి పొడి మాటలతో బాహుబలి గ్రేట్ అన్నారే తప్ప ఏ బాలీవుడ్ హీరో బాహుబలి ప్రస్థానం గురించి ప్రత్యేకంగా మాట్లాడింది లేదు.

ఇక అలాంటి సినిమా తాము ఎందుకు తీయలేదు.. తియ్యకూదడు అన్న ఆలోచనలు మొదలయ్యాయి. బాహుబలితో కేవలం హిందిలోనే కాదు మిగతా భాషల మేకర్స్ కూడా అలాంటి సినిమాల మీద ఫోకస్ పెట్టారు. తమిళంలో సంఘమిత్ర, మలయాళంలో మహాభారతం వీటన్నిటికి బాహుబలి స్పూర్తి అని చెప్పకనే చెప్పొచ్చు. ఇక ఇప్పుడు అదే తరహాలో బాలీవుడ్ లో వస్తున్న సినిమా తానాజి.

ఛత్రపతి శివాజి సైన్యంలో గొప్ప పోరాట యోధుడు సుబేదార్ తానాజి మాల్సూరె. 1870లో మొఘలులతో జరిగిన యుద్ధంలో తానాజి చూపించిన తెగువ చారిత్రలో లిఖించబడింది. అందుకే తనాజి గురించి స్కూల్ బుక్స్ లో పాఠం కూడా వచ్చింది. అయితే ఇదే కథతో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ తానాజి సినిమా చేస్తున్నారు. ఓం రౌత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కాలిపోతున్న యుద్ధ వీరుడి ఫస్ట్ లుక్ అంచనాలను పెంచేసింది. అయితే తానాజి మెయిన్ టార్గెట్ బాహుబలి సినిమాను మించి వసూళ్ల హంగామా చేయడమే.. మరి అనుకున్నట్టుగా తానాజి ఆ రేంజ్ లో అదరగొడతాడో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news