Newsఎన్టీఆర్‌కి విశాల్ సవాల్.. ‘టెంపర్’ లేపుతాడా?

ఎన్టీఆర్‌కి విశాల్ సవాల్.. ‘టెంపర్’ లేపుతాడా?

నటనలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కి మించిన తోపు ఈ జనరేషన్‌లో ఎవరూ లేరంటూ ఎంతోమంది నటీనటులు ఇప్పటికే చాలా సందర్భాల్లో వెల్లడించారు. అతనితో పోటీ పడడం అసాధ్యమని.. అతనికి అతనే సాటి అని తమ అభిప్రాయాల్ని తెలిపారు కూడా. కేవలం మన తెలుగు హీరోలో కాదు.. ఇతర ఇండస్ట్రీ కథానాయకులు సైతం తారక్ నటనకు దాసోహం. తామంతా అతనికి ఫ్యాన్ అంటారే తప్ప.. అతనితో తమనితాము పోల్చుకోరు. కానీ.. ఒక్క హీరో మాత్రం తారక్‌కి ధీటుగా పోటీనిస్తానంటూ ముందుకొచ్చాడు. అతనిలాగే తానూ సత్తా చాటుకుంటానని సవాల్ విసురుతున్నాడు. అతనెవరని అనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. తమిళ హీరో విశాల్.

అసలు విషయం ఏమిటంటే.. తారక్ కెరీర్‌ని అనూహ్య మలుపు తిప్పిన ‘టెంపర్’ చిత్రాన్ని తమిళ్‌లో రీమేక్ చేసేందుకు మేకర్స్ చాలాకాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఎందరో హీరోలను సంప్రదించారు కానీ.. సినిమా చూసి అందరూ వెనకడుగు వేశారు. తారక్‌లా ఎనర్జీ పండించడం తమవల్ల కాదని సునాయాసంగా తప్పుకున్నారు. కానీ.. విశాల్ మాత్రం అందరిలా వెనకడుగు వేయకుండా చాలెంజింగ్‌గా తీసుకున్నాడు. తారక్‌లాగే తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో వెంటనే ‘టెంపర్’ రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇంతవరకు బాగానే వుంది కానీ.. తారక్‌లాగా అద్భుత అభినయం ప్రదర్శిస్తాడా? లేదా? అన్నదే మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

నిజానికి.. ఆ చిత్రంలో తారక్ చేసిన యాక్టింగ్‌కి ఎన్ని మార్కులేసినా తక్కువే. బీభత్సకరమైన కరెప్టెట్ పోలీస్ ఆఫసర్ పాత్రలో పూర్తిగా జీవించేశాడు. బహుశా రియల్‌లైఫ్‌లోనూ అలాంటి అధికారులు వుంటారోలేదో అనే అనుమానం రేకెత్తించేలా ‘దయ’ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. అలాంటి పాత్రను పోషించేందుకు విశాల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. తారక్‌కి సవాల్ విసిరినట్టే. మరి.. అతను కూడా తారక్‌లా ‘టెంపర్’ లేపుతాడా? లేదా? వేచి చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news