Gossipsతమన్నా మీద వాలిపోతున్న నందమూరి హీరో

తమన్నా మీద వాలిపోతున్న నందమూరి హీరో

ఆహా..  ఆ జంట చుడండి ఎంత కూట్ గా ఉందో. ఆ అమ్మాయి బుజాల మీద ఆ అబ్బాయి ఎంత ప్రేమగా వాలాడో కదా అనిపించేలా ఉంది. ఆమెపై వాలిపోయిన ఆ ప్రేమికుడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. తన్మయత్వంతో నిలబడి చూస్తున్న ఆ హీరోయిన్ తమన్నా. ఈ చూడ ముచ్చటైన జంటను చూడాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి.  
Kalyanram-and-Tamannaah-230x153
 
జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలోని స్టిల్ ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ విడుదలకు ముందే తమన్నా ఈ ఫొటోను లీక్ చేసేసి.. సినిమాపై అంచనాలు పెంచేసింది. సినిమాలోని ఓ పాట చిత్రీకరణలో భాగంగా కెమేరా మేన్ పీసీ శ్రీరామ్ ఈ చక్కని చిత్రాన్ని తీశారు. తమన్నా రేడియో జాకీగా కనిపించనున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.
 
రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌, కూల్‌ బ్రీజ్‌ సినిమా బ్యానర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌కుమార్‌ వట్టికూటి నిర్మాతలు. మహేష్‌ కోనేరు సమర్పిస్తున్నారు. శరత్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. 
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news