Gossipsమెగా మేకోవర్.. సైరా కోసం చిరు కొత్త ప్రయోగం ..!

మెగా మేకోవర్.. సైరా కోసం చిరు కొత్త ప్రయోగం ..!

మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 151వ సినిమా సైరా నరసింహారెడ్డి కోసం పూర్తి మేకోవర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నాడు. హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్స్ త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో చిరు లుక్ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

రీసెంట్ గా చిరంజీవి ఇంట్లో ఉన్న కాజువల్ లుక్ ఒకటి లీక్ అయ్యింది. ఈ పిక్ ఎలా బయటకు వచ్చిందో ఏమో కాని సినిమా కోసం చిరంజీవి ఎలా మారనున్నాడో కనిపిస్తుంది. బాడీ ఫిట్ తో పాటుగా గెడ్డంతో చిరు అదరగొడుతున్నాడు. కచ్చితంగా సైరా సినిమా అంచనాలను మించేలా తెరకెక్కించాలని చూస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా 150 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కనుందట.

మరి మెగా మేకోవర్ తో సంచలనాలు సృష్టిస్తున్న చిరు సినిమాతో మరోసారి తన సత్తా చాటుతాడని చెప్పొచ్చు. బాహుబలికి ధీటుగా సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్న సైరా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.chiru

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news