Gossipsమెగాస్టార్ ను నమ్ముకుంటే గుండు కొట్టించేశారు..!

మెగాస్టార్ ను నమ్ముకుంటే గుండు కొట్టించేశారు..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డి సెట్స్ మీదకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుతో పాటుగా జగపతి బాబు, విజయ్ సేతుపాతి, అమితాబ్ బచ్చన్, బ్రహ్మాజిలు నటిస్తున్నారు. అమితాబ్ ఇందులో నరసింహారెడ్డి గురువు పాత్రలో నటిస్తుండగా ఓబయ్యగా విజయ్ సేతుపతి నటిస్తున్నాడట. ఇక పక్కనే ఉంటూ నమ్మక ద్రోహం చేసే పాత్రలో జగపతి నటిస్తున్నాడని తెలుస్తుంది.

ఇవన్ని ఒక ఎత్తైతే సినిమాలో బ్రహ్మాజి రోల్ కూడా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. నరసింహారెడ్డికి నమ్మిన బంటుగా ఉంటూ ఆయనకు కాపలా మనిషి పాత్రలో బ్రహ్మాజి కనిపిస్తున్నాడట. దీని కోసం ఆహార్యంలో కూడా కొత్తదనం చూపిస్తున్నారట. ఒరిజినల్ పాత్ర గుండుతో ఉంటుందని.. గుబురు మీసంతో ఉంటాడని తెలియగా బ్రహ్మాజి వెంటనే సినిమా కోసం గుండు కొట్టించుకున్నాడని తెలుస్తుంది.

కచ్చితంగా సినిమాలో అతని పాత్రకు మంచి పేరు వస్తుందని అంటున్నారు చిత్రయూనిట్. మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే బ్రహ్మాజికి గుండు కొట్టించేశారు అంటూ సోషల్ మీడియాలో భలే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news