Gossipsసైరా కి కష్టాలు.. చివరికి ఫ్లాప్ డైరెక్ట‌ర్ చేతిలో..!

సైరా కి కష్టాలు.. చివరికి ఫ్లాప్ డైరెక్ట‌ర్ చేతిలో..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈమధ్యనే మొదలైన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పరుచూరి సోదరులు కథ అందించిన ఈ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో రాబోతుంది. మొదలైననాటి నుండి ఈ సినిమాపై రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి.
అస‌లే అనేక అనుమానాల్లో సైరా చిక్కుకుంటే ఇప్పుడు ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ అవుట్ ఫుట్ మీద చిరు తీవ్ర అసంతృప్తితో ఉన్నాడ‌న్న వార్త మెగా అభిమానులను తెగ టెన్ష‌న్ పెట్టేస్తోంది. ఫ‌స్ట్ షెడ్యూల్ అవుట్ ఫుట్ త‌ర్వాత చిరు గుణ‌శేఖ‌ర్‌ను ర‌మ్మ‌న్నాడ‌న్న వార్త మీడియాలో రావ‌డంతో అస‌లు సైరా షూటింగ్ విష‌యంలో ఏం జ‌రుగుతుందో ? ఎవ్వ‌రికి అర్థం కాలేదు. తాజాగా ఇప్పుడు మ‌రో దిమ్మ‌తిరిగి పోయే న్యూస్ భ‌య‌ట‌కు వ‌చ్చింది.

కెమెరామన్ తో పాటుగా రెహమాన్ కూడా ఈ సినిమా నుండి క్విట్ అవడంతో సినిమాపై రూమర్లు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఇప్పుడు సైరా నుండి దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా తప్పుకుంటున్నట్టు కామెంట్లు వినపడుతున్నాయి. సూరి బదులు కృష్ణవంశీ ఈ సినిమాను టేకప్ చేస్తున్నాడని అంటున్నారు. అనుభవం గల దర్శకుడు అయితే ఈ సినిమాకు పర్ఫెక్ట్ అని తెలిసి ఈ సినిమాకు సూరి ప్లేస్ లో కృష్ణ వంశీకి దర్శకత్వ బాధ్యతలను అప్పగిస్తున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news