Moviesసైరా రికార్డ్ తో సౌండ్ లేకుండా చేసిన మెగాస్టార్..!

సైరా రికార్డ్ తో సౌండ్ లేకుండా చేసిన మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఖైది నంబర్ 150 తర్వాత 151వ సినిమాగా రాబోతున్న మూవీ సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. మొదటి షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ రూపంలో సంచలనం సృష్టించింది. అమేజాన్ ప్రైం ఏకంగా 30 కోట్లు పెట్టి కొనేశారట.

ఇక సినిమాకు సంబందించి టీజర్, ట్రైలర్ లాంటివన్ని అమేజాన్ ప్రైం నుండే రిలీజ్ అవుతాయి. విజువల్ గ్రాండియర్ గా వస్తున్న ఈ సినిమాను ఇంత మొత్తంగా పెద్ద ప్లాన్ తోనే కొనేశారు అమేజాన్ ప్రైం. ఇక ఈ సినిమా బాహుబలి రేంజ్ బిజినెస్ చేసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమా 2019 సమ్మర్ టార్గెట్ తో వస్తుంది.

మరి సెట్స్ మీద ఉండగానే రికార్డులు సృష్టిస్తున్న సైరా ఇక సినిమా రిలీజ్ తర్వాత ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. పదేళ్ల తర్వాత ఖైది నెంబర్ 150తో సంచలనం సృష్టించిన చిరు 151తో ఆ లెక్క సరిచేసేలా చూస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news